గోపీచంద్ ‘మెగా’ సవాల్

జూన్ ఆరున రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటి మెగా అల్లుడు కళ్యాణ్ ‘విజేత’, రెండవది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ ‘తేజ్ ఐ లవ్ యూ’. అయితే ఈ రెండే ఒకటికి ఒకటి…

జూన్ ఆరున రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటి మెగా అల్లుడు కళ్యాణ్ ‘విజేత’, రెండవది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ ‘తేజ్ ఐ లవ్ యూ’. అయితే ఈ రెండే ఒకటికి ఒకటి పోటీ అవుతాయి అనుకుంటే, బరిలోకి గోపీచంద్ కూడా దిగబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు చక్రితో గోపీచంద్ చేస్తున్న పంతం సినిమాను కూడా అదే డేట్ కు థియేటర్లలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తేజ్ ఐ లవ్ యూ పక్కా లవ్ స్టోరీ. దీనికి ఫన్ మిక్స్ చేసి, వీలయినంత ఎంటర్ టైన్ మెంట్ జోడించారు. అంటే ఒక విధంగా యూత్ ఫుల్ సినిమా. విజేత సినిమా తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ. అంటే ఫ్యామిలీ టైపు సినిమా. పంతం పక్కా మాస్ సినిమా. గోపీచంద్ కు అచ్చి వచ్చిన మాస్, రివెంజ్ స్టోరీ టైపు.

ఒక లెక్కన చూసుకుంటే మూడూ మూడు రకాలు. కానీ ఓపెనింగ్స్ లెక్కన చూసుకుంటే సాయిధరమ్ తేజ్, గోపీచంద్ ముందు వరుసలో వుండి, మెగా అల్లుడిని ఆఖరున కూర్చోపెడతారేమో? లేదా ఏదో విధంగా పంతం వెనుక్కు వెనక్కు వెళితే, మెగా అల్లుడు, మేనల్లుడు పోటీ పడతారేమో?