సందిగ్ధంలో రోబో 2 బేరం

డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే కొత్త రికార్డు రోబో 2 తెలుగు హక్కుల మొత్తం. దాదాపు 80కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు మొత్తం కొనడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఇరవై…

డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే కొత్త రికార్డు రోబో 2 తెలుగు హక్కుల మొత్తం. దాదాపు 80కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు మొత్తం కొనడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఇరవై కోట్లు ఒకేసారి అడ్వాన్స్ గా చెల్లించి మరీ. దగ్గుబాటి సురేష్, ఆసియన్ సునీల్, రిలయన్స్ ముగ్గురు కలిసి ఈ బేరం సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కాస్త అనుమానంలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాలా సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఇది స్టార్ట్ అయింది. కాలా సినిమా టైమ్ లో 8కోట్లు వెనక్కి అడ్టస్ట్ చేయమని సునీల్ అండ్ కో అడిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా ఇంకా చాలా ఆలస్యం అయ్యేలా వుంది. ఈలోగా మళ్లీ చూద్దాం అనే టైపులో అడిగినట్లు తెలుస్తోంది. దానికి లైకా నుంచి తెలివైన సమాధానం వచ్చినట్లు వినికిడి. 8 కాదు 20కోట్లు వెనక్కు తీసుకోండి కావాలంటే అనే ఆన్సర్ రావడంతో ఏం చెప్పాలో వీళ్లకు తెలియలేదు. వద్దు అని అప్పటికి ఏమీ తీసుకోకుండా ఆపేసారు.

ఈలోగా కాలా వచ్చింది. మరీ ఆఫీసర్ మాదిరిగా డిజాసర్ట్ కాదు కానీ, హిట్ అయితే కాదు. ఇరవై కోట్ల మేరకు ఆడలేదు అన్నది పక్కా. రోబో 2ఇదిగో అదిగో అంటూ వెనక్కు వెనక్కు జరుగుతూ వుండడం, రజనీ మార్కెట్ పట్టుమని పది కోట్లు కూడా లేని పరిస్థితి కావడంతో సునీల్ అండ్ కో మరోసారి ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వెనక్కు వెళ్లకపోవచ్చు కానీ, ఇది సాకుగా చూపించి, రేటును వెనక్కు తెచ్చే ప్రయత్నాలు కావచ్చని వినిపిస్తోంది. అయితే ఆసియన్ సునీల్ వదిలేస్తే, దాన్ని పట్టుకోవాలని దిల్ రాజు చూస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రోబో 2బేరం వెనక్కు వెళ్లేలా వుందన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపించడం ప్రారంభమైంది.