అదిగో కారు.. ఇదిగో గిఫ్ట్

నాలుగు తొమ్మిదిలు నెంబర్ కనిపించింది. హీరో కనిపించాడు. అంతే. ఇంకేముంది. నిర్మాత హీరోకి కారు గిఫ్ట్ ఇచ్చారహో అని వార్త.  హారిక హాసిని సంస్థ ఎన్టీఆర్ కు కారు గిప్ట్ ఇచ్చింది. అలాగే త్రివిక్రమ్…

నాలుగు తొమ్మిదిలు నెంబర్ కనిపించింది. హీరో కనిపించాడు. అంతే. ఇంకేముంది. నిర్మాత హీరోకి కారు గిఫ్ట్ ఇచ్చారహో అని వార్త.  హారిక హాసిని సంస్థ ఎన్టీఆర్ కు కారు గిప్ట్ ఇచ్చింది. అలాగే త్రివిక్రమ్ కు కూడా ఒకటి. ఇదీ వార్త.

కానీ వాస్తవం వేరు. ఎన్టీఆర్ హారిక హాసిని బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. సాధారణంగా హీరోలు స్వంత కారులో వస్తారు. లేదా యూనిట్ కారు వెళ్తుంది. సరే, హీరోకి పంపడానికి మామూలు కారు వుంటే అంత బాగుండదు అన్న ఓ ఆలోచన పైగా సంస్థ నిర్మాతలు కూడా ఓ ఖరీదైన కారు కొనుక్కోవాలన్న ఆలోచన. దాంతో రేంజ్ రోవర్ వెలార్ పి 25మోడల్ కారు ఒకటి కోటి ఇరవై లక్షలకు కొనేసారు. ఎప్పుడు ఇదంతా మూడు నెలల క్రితం.

ఇక్కడ ఇంకో విషయం కూడా వుంది. ముందుగా హారిక హాసిని చినబాబు ఓ కారు కొన్నారు. అది ఆయనకు అంతగా నచ్చలేదు. దాంతో దాన్ని తాను తీసుకుంటా అని దర్శకుడు త్రివిక్రమ్ తీసుకున్నారు. ఆ తరువాత మళ్లీ చినబాబు ఓ కారు కొనుకున్నారు. బాగుంది అని చెప్పి, ఆయన అన్న కొడుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంశీ మరోటి కొన్నారు. అదీ జరిగింది.

ఎలాగూ హీరోకు కారుపంపాలి కదా అని ఈ ఖరీదైన కారు పంపుతున్నారు. సాధారణంగా హీరోల మనసు ఎరిగి ప్రవర్తించడం అన్నది నిర్మాతలకు మామూలే. అందుకే దానికి నెంబర్ కూడా ఎన్టీఆర్ కు ఇష్టమైన 9999నెంబర్ సంపాదించారు. అది కూడా హారిక హాసిని బ్యానర్ పైనే రిజిస్ట్రేషన్ కూడా.

కానీ ఒకటి రెండు ఎన్టీఆర్ ను చూడడం, అలాంటి కారులోనే త్రివిక్రమ్ ను చూడడంతో హారిక హాసిని నిర్మాత కారులు గిఫ్ట్ లు ఇస్తున్నారోచ్ అని వార్తలు పుట్టుకువచ్చాయి. ఆ వార్తలు హారిక హాసిని యూనిట్ లో నవ్వులు పూయిస్తున్నాయ్.