Advertisement


Home > Movies - Movie Gossip
ఎన్టీఆర్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేదు

కొన్ని సినిమాలంతే. ఎంత లేపడానికి ప్రయత్నించినా వర్కవుట్ కాదు. ఎలాంటి అంచనాల్లేకుండా అలా రిలీజ్ అయిపోతుంటాయి. కల్యాణ్ రామ్ నటించిన నా నువ్వే పరిస్థితి కూడా ఇదే. ఎందుకో మొదట్నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరగడం లేదు. స్వయంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగినప్పటికీ ఎందుకో సినిమాకు జనాలు కనెక్ట్ కాలేకపోతున్నారు.

తన యాక్షన్ ఇమేజ్ పక్కనపెట్టి, ఫస్ట్ టైం రొమాంటిక్ జానర్ లో సినిమా చేశాడు కల్యాణ్ రామ్. ఈ సినిమా కోసం సరికొత్తగా ముస్తాబయ్యాడు కూడా. అటు తమన్నను హీరోయిన్ గా తీసుకున్నారు. కల్యాణ్ రామ్, తమన్నది ఫ్రెష్ కాంబినేషన్ కూడా. అయినప్పటికీ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం లేదు.

రీసెంట్ గా జరిగిన నా నువ్వే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. అన్నయ్యకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. సినిమా హిట్ అవుతుంది, అంతా చూడండని కోరాడు. ఇలా ఎన్టీఆర్ తో ప్రచారం కల్పించడంతో పాటు సినిమా పబ్లిసిటీకి భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. కానీ ప్రయోజనం కనిపించడం లేదు.

రేపు నా నువ్వే విడుదలవుతుంది. ఈ మూవీకి పోటీగా 24గంటల గ్యాప్ లో సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమా థియేటర్లలోకి వస్తోంది. అటు సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 కూడా బరిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా నువ్వే సినిమా క్లిక్ అవ్వాలంటే, ఫస్ట్ డే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి. అంతకుమించి మరో మార్గం లేదు.