చిరు అలసిపోతున్నారా?

మెగాస్టార్ స్టేటస్. కోట్లాది అభిమానులు. అన్నీ కలిసి సినిమా చేయడానికి ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు. కానీ అరవై రెండేళ్ల వయసు సహకరించాలి. ఈ వయసులో చిరంజీవి ‘సైరా’ లాంటి భారీ సినిమా చేస్తున్నారు. Advertisement ఈ…

మెగాస్టార్ స్టేటస్. కోట్లాది అభిమానులు. అన్నీ కలిసి సినిమా చేయడానికి ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు. కానీ అరవై రెండేళ్ల వయసు సహకరించాలి. ఈ వయసులో చిరంజీవి ‘సైరా’ లాంటి భారీ సినిమా చేస్తున్నారు.

ఈ వారం రోజులుగా వాతావరణం కాస్త మారింది కానీ, గత రెండు నెలలుగా ఎండలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇటు వయసు, అటు వాతావరణం, పైగా సినిమా లైట్లు ఇవన్నీ కలిసి, మెగాస్టార్ చిరంజీవిని త్వరగా అలిసిపోయేలా చేస్తున్నాయని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

అందవల్లే ఆయన రోజుకు ఎక్కువ సీన్లు చేయలేకపోతున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. వ్యాయామం, యోగా వాటి వల్ల చిరంజీవి ఫిట్ గానే వున్నా, వర్క్ దగ్గరకు వచ్చేసరికి త్వరగా అలసిపోతున్నారని తెలుస్తోంది. అందువల్లనే వీలయినంత గ్యాప్ తీసుకుని ఆయన వర్క్ చేస్తున్నారని, మధ్యలో వేరే సీన్లు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల చిరంజీవి లుక్ కూడా కాస్త మారింది. మొహం ఉబ్బినట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న తేజ్ ఆడియో ఫంక్షన్ కు వచ్చినపుడు ఈ మార్పును జనం గమనించారు. ఇది సైరా గెటప్ లో పార్ట్ నా? లేక మొహం అలా మారిందా అని గుసగుసలు వినిపించాయి.

ఏమయినా అభిమానులు తన నుంచి ఆశిస్తున్నారని, చిరు ఈ వయసులో మరీ కిందా మీదా అయిపోవడం కన్నా, ఏడాదిన్నరకో, రెండేళ్లకో ఓ సినిమా చేయడం బెటర్. కానీ ఆయన సైరాలో తన పార్ట్ ను డిసెంబర్ నాటికి ముగించి, కొరటాల శివ సినిమా మీదకు వెళ్లే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.