ఫైట్ మాస్టర్ విజయ్ టాలీవుడ్ జనాలకు సుపరిచితమే. చాలా సినిమాలకు ఆయన పనిచేసారు. చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది వారసుల మాదిరిగానే ఆయన కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఫైట్ మాస్టర్ కొడుకు కదా అని వీర లెవల్లో ఫైట్లు చేస్తూ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఆయన కూడా తన కొడుకు కదా అని, కొత్త కొత్త ఫైట్లు కనిపెట్టి మరీ కుమ్మేయడం లేదు.
అచ్చమైన యూత్ లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నాడు ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్. ‘ఈ మాయ పేరేమిటో’ అనే మాంచి ఫీల్ లవ్ రొమాంటిక్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను ఈరోజు హీరో నాగ్ చైతన్య ఆవిష్కరించారు. సున్నితంగా హృదయాన్ని తాకే నేపథ్య సంగీతం, కళ్లకు హాయిగా వుండే విజువల్స్ అయితే టీజర్ లో బాగానే వున్నాయి.
కానీ కుర్రాడు ఎలా చేసాడు అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు. అమ్మాయి కావ్య థాపర్, విజయ్ రాహుల్ ఇద్దరూ చూడ్డానికి అయితే బాగానే వున్నారు. మూడు ముద్దులు, ఆరు హగ్గులు అన్నట్లు యూత్ అట్రాక్షన్స్ టీజర్లో బాగానే దట్టించారు. ‘ఇంతలా ప్రేమిస్తే, తిరిగివ్వడానికి నాదగ్గర ఏమీ లేదు’ అన్న డైలాగు సినిమా జోనర్ ను చెప్పకనే చెప్పింది.