Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ హల్ చల్ పనిచేసినట్లే

పవన్ హల్ చల్ పనిచేసినట్లే

శ్రీరెడ్డి ఒకపక్క, మహేష్ కత్తి మరోపక్క వుండి మీడియా మొత్తం టాలీవుడ్ ను టార్గెట్ చేసిన టైమ్ అది. గట్టిగా నెలో రెండు నెలలో అయ్యింది ఇది జరిగి. అలాంటి టైమ్ లో పవన్ సర్రున లేచారు. ఛాంబర్ కు వచ్చి హల్ చల్ చేసారు. దానికి మిగిలిన మెగా హీరోలు జతకలిసారు.

ఇలాంటి టైమ్ లో మా అసోసియేషన్ కూడా ముందుకు వచ్చింది. సినిమా పెద్దలు అంతా సమావేశం అయ్యారు. మీడియా బ్యాన్ అన్నారు. ఇంకా ఏదోదో అన్నారు. నానా హడావుడి జరిగిపోయింది.

ఆఖరికి అంతా గప్ చుప్ అయిపోయింది. ఏ చానెళ్లు అయితే బ్యాన్ కు గురవుతాయి అని అనుకున్నారో ఆ చానెళ్లకే మళ్లీ సినిమా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇది చూసి, అంతా తూచ్.. ఉత్తుత్తినే. మీడియాను మెగా హీరోలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏమీ చేయలేరు. మీడియాకు తల వొగ్గారు అనుకున్నారు అంతా.

కానీ చూస్తుంటే మీడియాకు తల వొగ్గడం కాదు. సినిమా ఇండస్ట్రీ, మీడియా కలిసి, ఓ రాజీ ఫార్ములాకు వచ్చినట్లు కనిపిస్తోంది. మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రాకండి అని. ఇదే జరిగి వుండాలి.

లేదూ అంటే ఈ పాటికి శ్రీరెడ్డి ఎక్కే ఛానెల్ దిగే ఛానెల్ అన్నట్లు వుండాలి పరిస్థితి. ఒక్కసారిగా శ్రీరెడ్డి టచ్ మీ నాట్ అన్నట్లు అయిపోయింది. ఏ చానెల్ కూడా టాలీవుడ్ విషయంలో డిస్కషన్లు చేయడం లేదు. ముఖ్యంగా శ్రీరెడ్డి లాంటి వివాదాస్పదమైన వారిని ఏరి కోరి పిలవడం లేదు.

అంటే, పవన్ హల్ చల్ పనిచేసినట్లే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?