క్లిక్ కావాలా? పద్దెనిమిది పైసలే

మా హీరో టీజర్ నాలుగు మిలియన్ల క్లిక్ లు, మా హీరో ట్రయిలర్ పది మిలియన్ల క్లిక్ లు అంటూ అభిమానులు మురిసిపోతూ వుంటారు. యూట్యూబ్ లో క్లిక్ ల లెక్క చూసి, హీరోలకు,…

మా హీరో టీజర్ నాలుగు మిలియన్ల క్లిక్ లు, మా హీరో ట్రయిలర్ పది మిలియన్ల క్లిక్ లు అంటూ అభిమానులు మురిసిపోతూ వుంటారు. యూట్యూబ్ లో క్లిక్ ల లెక్క చూసి, హీరోలకు, అభిమానులకు కిక్కెక్కిపోతూ వుంటుంది. కానీ యూట్యూబ్ క్లిక్ లు కూడా ఓ వ్యాపారమే అని ఆ రంగంలో వున్నవారికి, సినిమా జనాలకు మాత్రం తెలుసు.

యూట్యూబ్ లు క్లిక్ లు తెప్పించే వ్యాపారం రాను రాను పడిపోతోందట. ఆరంభంలో ఇది ఓ క్లిక్ కు 65పైసల లెక్కన వుండేది. అంటే 10మిలియన్లు అంటే కోటి క్లిక్ లు కావాలంటే, ఇంటూ 65పైసల లెక్కన చెల్లించుకోవాలి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ రంగంలో కూడా పోటీ పెరిగిపోయింది. మేం చేస్తాం, మేం చేస్తాం పోటీ పడి 65పైసల నుంచి ఇప్పుడు 18పైసలకు తగ్గిపోయిందట క్లిక్ రేటు.

ఇది మరీ మంచిది. హీరోలు హ్యాపీగా నిర్మాతల డబ్బులతో మరిన్ని క్లిక్ లు కొని, చూసారా మా ఘనత అంటూ ట్విట్టర్ లో అభిమానుల చేత పోస్టింగ్ లు చేయిస్తారు. హీరోల మెహర్బానీ కోసం నిర్మాతలు డబ్బులు ఖర్చు చేసి, క్లిక్ లు వచ్చేలా చేస్తూ వుంటారు. ప్రస్తుతం 18పైసలు వుంది రేటు అంటే రాను రాను అయిద పైసలకో, పదిపైసలకో పడిపోతుందేమో?