మహేష్-పివిపి.. ఏది నిజం?

సూపర్ స్టార్ మహేష్ బాబు–వంశీ పైడిపల్లి సినిమా కోర్టు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ స్క్రిప్ట్ తన నిర్మాణ సంస్థ కోసం తయారుచేయించుకున్నది అని, దీంతో వేరే సంస్థలు సినిమా చేయకూడదని నిర్మాత…

సూపర్ స్టార్ మహేష్ బాబు–వంశీ పైడిపల్లి సినిమా కోర్టు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ స్క్రిప్ట్ తన నిర్మాణ సంస్థ కోసం తయారుచేయించుకున్నది అని, దీంతో వేరే సంస్థలు సినిమా చేయకూడదని నిర్మాత పివిపి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. అది వాయిదాలు పడుతూ వస్తోంది.

చిత్రంగా ఆ వాయిదా డేట్ లే, మహేష్ షూటింగ్ డేట్ లుగా బయటకు వినిపిస్తూ వస్తున్నాయి. స్టే వెకేట్ పిటిషన్ జూన్ 4న వుండేది. అప్పుడే షూటింగ్ స్టార్ట్ అని వినిపించింది. 11కు వాయిదా పడింది కేసు. 4నుంచి షూటింగ్ స్టార్ట్ కాలేదు. 11న అని వినిపించింది. ఇప్పుడు తాజగా వాయిదా 18న వుంది. లేటెస్ట్ గా 17నుంచి షూట్ అని వినిపిస్తోంది.

4 నుంచి 11 నుంచి ఎందుకు షూట్ స్టార్ట్ చేయలేదు అంటే, మోడీ డెహ్రాడూన్ వస్తున్నారు. అందువల్ల పర్మిషన్ లేదు అని సమాధానం వచ్చింది. కానీ చిత్రంగా ఇదే డేట్ లలో రోబో 2షూటింగ్ డెహ్రాడూన్ లో హ్యాపీగా జరుగుతోంది. మరి దీనికే ఎందుకు పర్మిషన్ లేదు అంటే, లొకేషన్లు వేరు అంటున్నారు.

వాస్తవానికి దిల్ రాజు, అశ్వనీదత్ నేరుగా పివిపిని మూడు వారాల క్రితం కలిసినట్లు తెలుస్తోంది. మళ్లీ వస్తామన్నవారు ఇక వెళ్లలేదని తెలుస్తోంది. స్టే వెకెట్ అయితే బేరం ఒకలా ఆడొచ్చు. స్టే వుంటే ఇంకోలా ఆడొచ్చు అనే స్ట్రాటజీ తో దిల్ రాజు, అశ్వనీదత్, వాయిదాల ఫలితం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి పివిపి కూడా, కానీ తొందరేముంది. కేసు కోర్టులో వుంది చూసుకుందాం. అనే వేచి చూసే ధోరణిలో వున్నట్లు తెలుస్తోంది.

ఈలోగా మహేష్ డబ్బులు ఇచ్చేసాడు, సెటిల్ చేసేసాడు అంటూ ఫీలర్లు వదులుతున్నారు. ఇది ఫాల్స్ అనడానికి ఒకటే పాయింట్. ఇక్కడ మహేష్ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే స్క్రిప్ట్ వివాదం వున్నది వంశీ పైడిపల్లికి పివిపికి మద్య. అంతే కానీ మహేష్ కు పివిపికి మద్యకాదు. మహేష్ కి పివిపికి వున్నది వేరే. బ్రహ్మోత్సవం ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో సినిమా చేయాలి. అది కూడా 2018లోపు.

అంటే బ్రహ్మోత్సవానికి మహేష్ డబ్బులు వెనక్కు ఇచ్చాడని ఎలా ఫీలర్లు పుట్టించారో. పివిపితో సెటిల్ అయిపోయిందని అలాగే ఫీలర్లు వదుల్తున్నట్లు కనిపిస్తోంది. రెండూ నిజాలు కావు.