ఇప్పటికే ఓ ఫ్లాప్ డైరక్టర్ కు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు నాగార్జున. ఆఫీసర్ సినిమా అతడ్ని చాన్నాళ్లు వెంటాడ్డం ఖాయం. ఇలాంటి టైమ్ లో నాగ్ మరో ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది ప్రశ్న. అతడే కల్యాణ్ కృష్ణ.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా చేస్తానని నాగ్ గతంలోనే ప్రకటించాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు పాత్ర ఆధారంగా రాసుకున్న కథ ఇది. కానీ స్టోరీలైన్ బాగాలేదని కల్యాణ్ కృష్ణను పక్కనపెట్టాడు నాగార్జున. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట.
రీసెంట్ గా నేలటిక్కెట్టు సినిమాతో అట్టర్ ఫ్లాప్ అందుకున్నాడు కల్యాణ్ కృష్ణ. బంగార్రాజు పాత్ర ఆధారంగా కాకుండా.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా మరో కథ రాసుకున్నానని, త్వరలోనే నాగ్ కు ఆ స్టోరీ వినిపిస్తానని కల్యాణ్ కృష్ణ ప్రకటించాడు. చెప్పినట్టుగానే రీసెంట్ గా నాగ్-కల్యాణ్ కృష్ణ మధ్య చర్చలు జరిగాయి. కాకపోతే నేలటిక్కెట్టుతో ఫ్లాప్ తెచ్చుకున్న కల్యాణ్ కృష్ణకు నాగ్ ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.
ఎంతోమంది వద్దన్నప్పటికీ, మేజిక్ జరుగుతుందేమో అనే గుడ్డి నమ్మకంతో వర్మకు అవకాశమిచ్చాడు నాగార్జున. కానీ ఆఫీసర్ సినిమా డిజాస్టర్ అయింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు కల్యాణ్ కృష్ణ విషయంలో కూడా మరోసారి అదే రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ భయం. ఆఫీసర్ దెబ్బతో నాగ్ ఫ్యాన్స్ తలెత్తుకోలేకపోతున్నారు.