హీరోయిన్ రెమ్యూనిరేషన్ డైరక్టర్ ఖాతాలో

డైరక్టర్ ఫలానా హీరోయిన్ కావాలని అడగడం వరకు ఓకె. ఇది టాలీవుడ్ లో కామన్. అయితే ఆ హీరోయిన్ నే కావాలని చెప్పి, అవసరం అయితే రెమ్యూనిరేషన్ తాను కొంత భరిస్తానని డైరక్టర్ ముందుకు…

డైరక్టర్ ఫలానా హీరోయిన్ కావాలని అడగడం వరకు ఓకె. ఇది టాలీవుడ్ లో కామన్. అయితే ఆ హీరోయిన్ నే కావాలని చెప్పి, అవసరం అయితే రెమ్యూనిరేషన్ తాను కొంత భరిస్తానని డైరక్టర్ ముందుకు రావడం అంటే కొంచెం ఆలోచించాల్సిందే. దీని వెనుక వ్యవహారం ఏమయి వుంటుందా? అని గుసగుసలు ప్రారంభమవుతాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇప్పటికి రెండు సూపర్ హిట్ లు, ఒక యావరేజ్ హిట్ కొట్టి, మాంచి మాస్ డైరక్టర్ అని పేరు తెచ్చుకున్న యంగ్ డైరక్టర్ ఒకరికి, తన రెండో సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి పై మాంచి అభిమానం ఏర్పడింది. ఆ సినిమా తరువాత నుంచి ఆ హీరోయిన్ తో సదరు హీరోకు సాన్నిహిత్యం పెరిగిందని గుసగుసలు పెరిగాయి.

వాటి నిజానిజాలు ఏమో కానీ, ఇప్పుడు అదే డైరక్టర్ తన మూడో సినిమాగా ఓ మల్టీ స్టారర్ కు శ్రీకారం చుట్టారు. ఆ సినిమాలో ఓ హీరోయిన్ గా తనకు నచ్చిన ఆ అమ్మాయినే తీసుకోవాలని నిర్మాతను కోరాడట. దర్శకుడు అడిగాడు కనుక నిర్మాత కూడా సరే అన్నారు. కానీ సమస్య అంతా రెమ్యూనిరేషన్ దగ్గర వచ్చింది. యాభై లక్షలు కావాలని అడగిందట ఆ హీరోయిన్. ఇరవై లక్షలకు మించి ఇవ్వలేనని, అదే సరైన పారితోషికం అని నిర్మాత అన్నాడట. 

ఆఖరికి ఈ సమస్య భలే చిత్రంగా సెటిల్ అయినట్లు తెలుస్తోంది. నిర్మాత ఇరవైలక్షలు ఇవ్వడానికి మరో పది లక్షలు, డైరక్టర్ రెమ్యూనిరేషన్ నుంచి ఇవ్వడానికి టోటల్ గా ముఫై లక్షలు పారితోషికంగా ఫిక్స్ చేసారట. అంటే తన డబ్బులు పది లక్షలు ఖర్చు చేసి మరీ హీరోయిన్ చాన్స్ ఇప్పించారన్నమాట డైరక్టర్. ఏమిటో అంత ఆనందం?