సుమ కనిపించనిది అందుకేనా?

సినిమా ఫంక్షన్ అంటే యాంకర్ సుమ వుంటే అదో అట్రాక్షన్. అదో అందం. కానీ ఈ మధ్య సినిమా ఫంక్షన్లకు సుమ కనిపించడం తగ్గిపోయింది. దీనికి కారణం సుమ మరీ బిజీ అయిపోవడం కాదని…

సినిమా ఫంక్షన్ అంటే యాంకర్ సుమ వుంటే అదో అట్రాక్షన్. అదో అందం. కానీ ఈ మధ్య సినిమా ఫంక్షన్లకు సుమ కనిపించడం తగ్గిపోయింది. దీనికి కారణం సుమ మరీ బిజీ అయిపోవడం కాదని తెలుస్తోంది. గతంలో సుమ ఎంత బిజీనో, ఇప్పడూ అంతే. అంతమాత్రం చేత ప్రెస్ మీట్లు, సినిమా ఫంక్షన్ లు చేయలేనంత బిజీ మాత్రం కాదు. ఎందుకంటే సినిమా పంక్షన్లు మహా అయితే అరగంట నుంచి మూడు గంటలు వుంటాయి. అంతకు మించి వుండవు.

అయితే సుమ ఇటీవల తక్కువగా కనిపించడానికి కారణం వేరు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె సినిమా ఫంక్షన్ అంటే, అది ఏదయినా, రెండు లక్షలు రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారట. జస్ట్ టీజర్ లాంచ్ అయినా, గెట్ టు గెదర్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా, ఏదయినా సుమ పారితోషికం రెండు లక్షలు ఫిక్స్ అంట.

అందుకే భారీ ఆడియో ఫంక్షన్లు మినహా మిగిలిన వాటికి ఇప్పుడు సుమను అవాయిడ్ చేస్తున్నారట. ఆ మధ్య చాలా తక్కువగా కనిపించిన మరో యాంకర్ ఝాన్సీ ఇప్పుడు మళ్లీ సుమకు ఆల్టర్ నేటివ్ గా కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చినపుడు కూడా ఈ కాస్ట్ రీత్యానే సుమను కాదని ఝాన్సీని తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఏమయినా డిమాండ్, సప్లయ్ ను బట్టి వుంటుంది. సుమ యాంకరింగ్ కావాలి అనుకుంటే రెండు లక్షలు ఇస్తారు. లేదంటే లేదు. సుమ మాత్రం తనమాట మీదే వుండిపోతున్నట్లు కనిపిస్తోంది.