ఒకవైపు ఈమె ప్రేమకథ గురించి బాగానే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరో రన్‌బీర్ కపూర్‌తో అలియాభట్ రొమాన్స్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదివరకూ కత్రినాతో ప్రేమాయణాన్ని నడిపించాడు రణ్‌బీర్. వాళ్లిద్దరూ సహజీవనం కూడా చేశారు కొన్నిరోజులు. తర్వాత విడిపోయారు. పెళ్లే తరువాయి అనుకున్న దశలో వారు వేరుపడ్డారు.
తమ లవ్ నెస్ట్ నుంచి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అంతటితో ఆ కథ ముగిసింది. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ మరో హీరోయిన్‌ని పట్టినట్టుగా.. అలియాతో ప్రేమాయణాన్ని నడిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సూటిగా స్పందించలేదు కానీ.. తను తొందరగానే పెళ్లి చేసుకుంటానని అంటోంది అలియాభట్.
చాలామంది హీరోయిన్లు.. పెళ్లి అనగానే, అప్పుడేనా అంటూ ఉంటారు. బాలీవుడ్‌లో హీరోయిన్లు ఎవరూ యుక్త వయసులో పెళ్లి చేసుకున్న దాఖలాలు లేవు. 35యేళ్లు వచ్చిన హీరోయిన్లు కూడా ఇంకా తామేదో టీనేజ్ గర్ల్స్ అయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అలియా మాత్రం అలా మాట్లాడలేదు. తను త్వరగానే పెళ్లి చేసుకుంటానని అంటోంది.
ముప్పై యేళ్ల వయసులోపే తను పెళ్లి చేసుకోవచ్చని ఈ హీరోయిన్ చెప్పడం విశేషం. చాలామంది ముప్పై యేళ్ల లోపు పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటారని.. తన పెళ్లి అంతకన్నా త్వరగానే అయిపోతుందేమో అని అలియా వ్యాఖ్యానించింది.
అయితే అదెవరితోనో చెప్పలేదు. ప్రస్తుతం ‘రాజి’ సినిమా హిట్‌తో ఉత్సాహంతో ఉంది అలియా. ఈమె వయసు ఇప్పుడు 25యేళ్లు!