ఆఫీసర్ సినిమా అమ్మకాల కోసమో, మరెందుకోసమో, అఖిల్ తో తన సినిమా పక్కా అంటూ గ్యాసిప్ లకు ఆస్కారం ఇచ్చారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తూచ్ అంతా ఉత్తుత్తినే అని మీడియాలో కథనాలు వచ్చినా, లేదు అఖిల్ తో సినిమా వుందనే వార్తలకు ప్రచారం కల్పించింది వర్మ్ క్యాంప్.
ఆఫీసర్ సినిమా విడుదలయింది. నాగ్ కెరీర్ లోనే బెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఆయన నటించిన సినిమాల్లో ఇంతలా డెఫిసిట్ తో రన్ అయిన సినిమా మరోటి లేదు. ఈ సినిమా తరువాత వర్మ మళ్లీ ఇప్పటి వరకు ట్విట్టర్ లోకి రాలేదు. సినిమా విడుదలకు ముందు రోజు ఓ ట్వీట్ చేసారు. దేవిలో ఆఫీసర్ సినిమా చూడబోతున్నానంటూ.
ఆ తరువాత పొలిటీషియన్ల మీద ఓ చిన్న సెటైర్ వేసారు. అంతకు తప్ప ఆఫీసర్ సినిమా గురించి ఒక్క ట్వీట్ లేదు. ఆఫీసర్ డిజాస్టర్ తరువాత నాగ్ మాత్రం, జయాపజయాలు కామన్ అనేలా ఓ ట్వీట్ వేసారు. దాన్నే వర్మ రీ ట్వీట్ చేసారు.
సాధారణంగా వర్మ, ఆయన బ్యాచ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా వుంటారు. ఇప్పడు వర్మ, ఆయన బ్యాచ్ ఎవ్వరూ ట్విట్టర్ జోలికి రాలేదు. ముఖ్యంగా ఆఫీసర్ ను సమర్థించడం లేదా? ఏదోలా సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. మామూలుగా అయితే వర్మ ఏ విషయం చెప్పడానికి ఏమాత్రం జంకరు. కానీ ఈసారి మాత్రం దాదాపు వారం రోజులు ట్వీట్ లు లేకుండా వుండడం అంటే షాక్ మామూలుగా తగిలి వుండకపోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును, మరి ఇంతకీ అఖిల్ తో సినిమా గురించి వర్మ టీమ్ ఇప్పుడేమంటుందో?