పాపం.. తేజ

దర్శకుడు తేజ కొత్త సినిమా ఏదీ ఒక పట్టాన పట్టాలు ఎక్కేలా కనిపించడంలేదు. బోలెడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పల్టీకొట్టేసిన తరువాత నేనేరాజు నేనేమంత్రి సినిమా హిట్ కావడమే ఓ అద్భుతం. ఎందుకంటే ఆనాటి…

దర్శకుడు తేజ కొత్త సినిమా ఏదీ ఒక పట్టాన పట్టాలు ఎక్కేలా కనిపించడంలేదు. బోలెడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పల్టీకొట్టేసిన తరువాత నేనేరాజు నేనేమంత్రి సినిమా హిట్ కావడమే ఓ అద్భుతం. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు అవి. తేజ సినిమాలు హిట్ అన్నది జనం దాదాపు మరచిపోయారు. అలాంటి టైమ్ లో హిట్ వచ్చింది.

అయితే ఆ వెంటనే సినిమా మాత్రం రాలేదు. వెంకీతో సినిమా, ఇదిగో, అదిగో అంటూ నానుతూనే వచ్చింది. ఆఖరికి అది కాదు, ఎన్టీఆర్ బయోపిక్ అన్నారు. తేజ రొట్టె విరిగి నేతిలో పడింది అనుకున్నారంతా. కానీ అంతలోనే అదికాస్తా వెనక్కుపోయింది. దాంతో వెంకీ సినిమా మళ్లీ ముందుకు వచ్చింది.

కానీ అంతలోనే అదికాదు రానాతో ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా ముందుగా వుంటుంది అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తే రానా కంటి ఆపరేషన్ అని కాదు, కాదు కిడ్నీ సమస్య అని ఏవేవో వినిపిస్తున్నాయి. అవి ఏవయినా, రానా ఇప్పట్లో సినిమా చేసేలా లేడు. అలాగే ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కూడా ఇప్పట్లో సినిమా చేస్తుందా? అన్నది అనుమానం. 

మళ్లీ వెంకీ-తేజ గ్యాసిప్ లు స్టార్ట్ అవుతాయా? లేక తనకు అచ్చివచ్చిన, అచ్చిరాని కొత్తవారితో సినిమా అనే దారిలోకి తేజ వెళ్తారా?