సవ్యసాచి అదుపు తప్పుతోందా?

నాగ చైతన్యకి ఫిక్స్‌డ్‌ మార్కెట్‌ వుంది. అతని సినిమాలకి ఇరవై నుంచి ఇరవై అయిదు కోట్లు పెడితే నిర్మాత సేఫ్‌లో వుంటాడు. చైతన్య హిట్‌ సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ఆడుతుంటాయి. బాక్సాఫీస్‌ పరంగా…

నాగ చైతన్యకి ఫిక్స్‌డ్‌ మార్కెట్‌ వుంది. అతని సినిమాలకి ఇరవై నుంచి ఇరవై అయిదు కోట్లు పెడితే నిర్మాత సేఫ్‌లో వుంటాడు. చైతన్య హిట్‌ సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ఆడుతుంటాయి. బాక్సాఫీస్‌ పరంగా చైతన్య రేంజ్‌ ఇంతకుమించి పెరగలేదు. పలు చిత్రాలతో తన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేసినా కానీ ఫలించలేదు.

హిట్టయితే ఇరవై నుంచి ఇరవై అయిదు కోట్లు వసూలవుతాయి కానీ ఫ్లాప్‌ అయితే రికవరీ చాలా కష్టమని పలు చిత్రాలు నిరూపించాయి. సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం లాంటి చిత్రాలకి పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాలేదు. అందుకే చైతన్య చిత్రాలపై బడ్జెట్‌ అదుపు తప్పకుండా నిర్మాతలు జాగ్రత్త పడతారు.

కానీ నాగ చైతన్యతో చందు మొండేటి రూపొందిస్తోన్న 'సవ్యసాచి' చిత్రానికి బడ్జెట్‌ అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ అయిందట. ఇంకా నిర్మాణ దశలోనే వున్న ఈ చిత్రానికి వ్యయం ముప్పయ్‌ అయిదు కోట్లు పైగానే అవుతుందని, పూర్తయ్యే సరికి నలభై కోట్లు టచ్‌ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే నిజమయితే ఈ చిత్రంతో నాగచైతన్య ఉన్నపళంగా తన మార్కెట్‌ని డబుల్‌ చేయగలిగితే తప్ప నిర్మాతలు సేఫ్‌ అవరు. దర్శకుడికి కూడా ప్రత్యేకించి ఎలాంటి రేంజ్‌ లేనపుడు ఇంత బడ్జెట్‌ ఎలా పెట్టేస్తున్నారో మరి.