ఒక్క పాటకు కోటి

ఒక పాటకు కోటి అంటే టాలీవుడ్ లో పెద్ద చిత్రమేం కాదు. పెద్ద సినిమాల్లో పాటకు కోట్లు ఖర్చు పెట్టిన వైనం వుండనే వుంది. కానీ మీడియం సినిమాలో పాటకు కోటి ఖర్చు చేయడం…

ఒక పాటకు కోటి అంటే టాలీవుడ్ లో పెద్ద చిత్రమేం కాదు. పెద్ద సినిమాల్లో పాటకు కోట్లు ఖర్చు పెట్టిన వైనం వుండనే వుంది. కానీ మీడియం సినిమాలో పాటకు కోటి ఖర్చు చేయడం కాస్త ఆశ్చర్యమే.

మారుతి-నాగచైతన్య కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో ఆరంభంలోనే ఓ సంగీత్ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ కోసం మాంచి సెట్ వేసి, భారీగా చిత్రీకరిస్తున్నారు. టోటల్ సాంగ్ అంతా అయిదారు రోజుల పాటు నైట్ షూట్ లోనే చిత్రీకరిస్తారు. దాదాపు కీలకమైన స్టార్ కాస్ట్ అంతా పాల్గోనే ఈ పాట కోసం దగ్గర దగ్గర కోటి రూపాయిలు ఖర్చు చేస్తున్నారట.

చిత్రమేమిటంటే శైలజరెడ్డి అల్లుడు సినిమాలో ఒకటే డ్యూయట్ వుంటుంది. సంగీత్ సాంగ్, రెండు మాంటేజ్ సాంగ్ లు, ఓ టీజింగ్ కమ్ హీరో మెసేజ్ సాంగ్, ఇలా అయిదు పాటలు వుంటాయట సినిమాలో. సినిమా ఫస్ట్ హాఫ్ లో డ్యూయట్ వుండదు. సెకండాఫ్ లోనే డ్యూయట్ వుంటుంది. వీటన్నింటికి గోపీ సుందర్ మంచి ట్యూన్ లు అందించినట్లు బోగట్టా.

సీనియర్ నరేష్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ వంటి నటులు అంతా ప్రతి ఒక్కరు యాభై రోజులకు పైగానే కాల్ షీట్ లు ఇవ్వడం, మారుతి, చైతూ రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి ఈ సినిమాకు ఖర్చు ఇరవైకి పైగానే అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవర్ సీస్, డిజిటల్, శాటిలైట్ కలిపే 10కోట్లు రికవరీ అయిపోతోంది. నైజాం, సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక కలిపి ఆ మిగిలినది భర్తీ చేయాలి.