రాజశేఖర్ కు ఆ సినిమా కూడా పోయిందా?

గరుడవేగ సినిమా తరువాత మళ్లీ హీరో రాజశేఖర్ పేరు మోత మోగింది. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా స్టార్ట్ కాలేదు. ఇటు స్వంత సినిమా లేదు. వేరే వాళ్ల సినిమాలు లేవు. Advertisement…

గరుడవేగ సినిమా తరువాత మళ్లీ హీరో రాజశేఖర్ పేరు మోత మోగింది. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా స్టార్ట్ కాలేదు. ఇటు స్వంత సినిమా లేదు. వేరే వాళ్ల సినిమాలు లేవు.

ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో హీరో రామ్ తో సినిమా వుంటుందనుకుంటే, అడ్వాన్స్ చేతిలో పడి కూడా సినిమా క్యాన్సిల్ అయింది. ఇంకోపక్క తమిళ తెలుగు భాషల్లో ఓ సినిమా వుంటుందని ఆ మధ్య వినిపించింది. తమిళ హీరో ధనుష్ తన స్వంత నిర్మాణం, డైరక్షన్ లో ఈ సినిమా చేస్తారని వినిపించింది.

కానీ లేటెస్ట్ గా నాగార్జున ఓ సినిమాను ధనుష్ తో చేయబోతున్నా అని వెల్లడించాడు. ధనుష్ కథ చెప్పాడని, తాను ఆల్ మోస్ట్ ఓకె అన్నానని నాగ్ చెప్పాడు.

మరి ధనుష్ తెలుగు తమిళంలో రాజశేఖర్ తో చేయాలనుకున్న సినిమా ఇదేనా? లేక అది వేరు, ఇది వేరునా? ధనుష్ తెలుగు హీరోతో తెలుగు సినిమా చేయాలనుకోవమడే ఓ సర్ప్రయిజ్. అలాంటివి రెండు వుంటాయా? అనుమానమే. అంటే రాజశేఖర్ ను వదిలేసి నాగ్ వైపు వెళ్లాడని అనుకోవాలా?