డెహ్రాడూన్ లో మహేష్ సినిమా

మహేష్ అప్ కమింగ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించే సినిమా షూట్ ఈ నెలలో ప్రారంభం కావాల్సి వుంది. ప్రస్తుతం…

మహేష్ అప్ కమింగ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఇది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించే సినిమా షూట్ ఈ నెలలో ప్రారంభం కావాల్సి వుంది. ప్రస్తుతం మహేష్ బాబు సమ్మర్ టూర్లో విదేశాల్లో వున్నారు. ఆయన రావడం, డేట్ లు కేటాయించడం బట్టి జూన్ 8నుంచి లేదా 10నుంచి తొలి షెడ్యూలు ప్రారంభం అవుతుంది.

తొలి షెడ్యూలును డెహ్రాడూన్ లో ప్లాన్ చేసారు. డెహ్రాడూన్ ఇప్పుడు మాంచి కూల్ గా వుంటుంది. ముస్సోరి లాంటి హిల్ స్టేషన్ అక్కడికి దగ్గరే. ఈ ప్రాంతంలోనే తొలి షెడ్యూలు ప్లాన్ చేసారు.

ఇదిలా వుంటే ఈ సినిమాకు అప్పుడే నాలుగు పాటల ట్యూన్లు ఫైనల్ అయిపోయాయి. వంశీ పైడిపల్లి, దేవీశ్రీప్రసాద్, దిల్ రాజు కలిసి, నాలుగు ట్యూన్ లు ఓకె చేసేసుకున్నారు. లిరికల్ వర్క్ జరుగుతోంది.

కృష్ణుడు – కుచేలుడు ఫార్మాట్ లాంటి కథ ఇది. ధనికుడిగా మహేష్, స్నేహితుడైన కుచేలుడు లాంటి వాడిగా అల్లరి నరేష్ కనిపిస్తారు.