తనకు కాస్టింగ్ కౌచ్ ఎదురైన దాఖలాలు లేవని అంటోంది ఆలియాభట్. సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి తనతో ఎవరూ సెక్సువల్ ఫేవర్స్ అడగలేదని ఆలియా అంటోంది. కాస్టింగ్ కౌచ్ అంశంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆలియా వ్యాఖ్యానాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇండస్ట్రీలో సెక్సువల్ ఫేవర్స్ అడుగుతూ అవకాశాలు ఇస్తామనే వారు తనకు తారసపడలేదని ఆలియా చెప్పుకొచ్చింది.
నిజమే.. ఆలియా వంటి వాళ్లకు ఇలాంటి అనుభవాలు ఎలా ఎదురవుతాయి? ఎందుకంటే.. ఈమె ఒక పెద్ద దర్శకుడు, నిర్మాత అయిన మహేశ్ భట్ కూతురు. అలాగే బాలీవుడ్లో వీరి కుటుంబీకులు అనేకమంది బాగా సెటిలయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన నటి ఆలియా.
కాస్టింగ్ కౌచ్ అంటే.. ఎవరో అనామక అమ్మాయిలను వేధించవచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లను సినిమా వాళ్లు వేధించవచ్చు. అవకాశాల విషయంలో పడక సుఖం ఇవ్వమని ఒత్తిడి చేయవచ్చు. అదే ఆలియా వంటి నేపథ్యం ఉన్న వారిని ఎవరూ ఏమీ అనలేరు. ఇలాంటి వారిని వేధింపులకు గురిచేయడం ఎవరికైనా అంత ఈజీకాదు కదా. కాబట్టి ఆలియాకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోవడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదు!