అమెరికా నేపథ్యంలో అవసరాల సినిమా

అవసరాల శ్రీనివాస్ మళ్లీ మరో మాంచి క్లాస్ ఫన్ ఎంటర్ టైనర్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తుంది. Advertisement నవంబర్ నుంచి నిరవధికంగా…

అవసరాల శ్రీనివాస్ మళ్లీ మరో మాంచి క్లాస్ ఫన్ ఎంటర్ టైనర్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తుంది.

నవంబర్ నుంచి నిరవధికంగా సెట్ మీదకు వెళ్లే ఈ సినిమా మూడు వంతులకు పైగా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది. తన తొలి సినిమా హీరో నాగశౌర్యనే మళ్లీ ఈ సినిమాకు కూడా ఎంచుకున్నాడు అవసరాల.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ సినిమాలో నాగశౌర్య కనిపిస్తాడు. రిచ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తో నడుస్తుంది సినిమా అంతా. ఈ సినిమాకు మంచి హీరోయిన్ కోసం వెదుకులాట ప్రస్తుతం జరుగుతోంది.

సాయి కొర్రపాటి ప్రస్తుతం మెగా అల్లుడుతో విజేత సినిమా నిర్మిస్తున్నారు. అది జూలైలో విడుదలయిపోతుంది. ఆ వెంటనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, నవంబర్ నుంచి అమెరికా వెళ్తారు. ఈ సినిమాకు సంగీతం కళ్యాణ్ మాలిక్.