పరుచూరి బ్రదర్స్ అండ్ ఓల్డ్ ఐడియాస్?

చాన్నాళ్ల తరువాత బాలయ్యకు కథ, మాటలు అందించబోతున్నారు పరుచూరి బ్రదర్స్ అనే వార్త బయటకు వచ్చింది. వివి వినాయక్ డైరక్షన్ కూడా. దాంతో బాలయ్య అభిమానులకు ఎంతో ఉత్సాహం. కానీ తీరా చూస్తే అంత…

చాన్నాళ్ల తరువాత బాలయ్యకు కథ, మాటలు అందించబోతున్నారు పరుచూరి బ్రదర్స్ అనే వార్త బయటకు వచ్చింది. వివి వినాయక్ డైరక్షన్ కూడా. దాంతో బాలయ్య అభిమానులకు ఎంతో ఉత్సాహం. కానీ తీరా చూస్తే అంత సీన్ కనిపించడం లేదని వినిపిస్తోంది వివి వినాయక్ మాంచి దర్శకుడే కానీ, కథకుడు కాదు. ఆయనకు అదే సమస్య. ఎవరైనా కథలు ఇస్తే, ఆయన అద్భుతంగా తీసి ఇస్తాడు. కథ సెట్ కాకపోతే అంతే సంగతులు.

అందుకే పరుచూరి బ్రదర్స్ కథల వంటకాలు ప్రారంభించారు. కానీ సమస్య ఏమిటంటే, ఇప్పటికి పరుచూరి బ్రదర్స్ చెబుతున్న లైన్ లు ఏవీ బాలయ్య దాకా వెళ్లడం లేదట. వినాయక్, నిర్మాత సి కళ్యాణ్ రేంజ్ లోనే వెనక్కు వెళ్లిపోతున్నాయట. పరుచూరి బ్రదర్స్ చెబుతున్న కాలం చెల్లిన లైన్లు విని, వారే నో అంటున్నారట.

మరో పక్క సినిమా స్టార్ట్ చేయాలన్న ఆలోచన, తొందర నిర్మాత సి కళ్యాణ్ కు  ఎక్కువగా వుంది. కానీ లైన్ మాత్రం సెట్ కావడం లేదు ఈ లోగా బోయపాటి-బాలయ్య సినిమాకు ఓపెనింగ్ చేసేసి వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.