ప్రెగ్నెన్సీ రావడంతో.. హీరోయిన్‌ పెళ్లి?

ఉన్నట్టుండి పెళ్లి చేసుకున్న నేహా ధూపియా విషయంలో కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే ఈ నటీమణి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ…

ఉన్నట్టుండి పెళ్లి చేసుకున్న నేహా ధూపియా విషయంలో కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే ఈ నటీమణి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ తనయుడిని నేహా పెళ్లి చేసుకుంది. అతడు ఈమెకన్నా రెండేళ్లు చిన్నవాడు. అలాగే వీరి పెళ్లికి ముందు వీరి ప్రేమ కథ గురించి పెద్దగా ప్రచారం కూడా లేదు. చాలా షడన్‌గా పెళ్లి చేసుకునేసి పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసేసింది నేహా.

ఈమె ఇలా ఎందుకు చేసింది? అనే అంశంపై ఇప్పుడు బాలీవుడ్‌ మీడియా పరిశోధన చేస్తోంది. అందులో తేలినది ఏమిటంటే.. నేహా ధూపియా ప్రెగ్నెంట్‌ అని, అందుకే ఆమె ఉన్నట్టుండి పెళ్లి చేసేసుకుందని! కొన్నేళ్లుగా అంగద్‌ బేడీ, నేహాలు ప్రేమలో ఉన్నారట. సహజీవనం కూడా చేస్తున్నారట. ఫలితంగా ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యిందని, అబార్షన్ల జోలికి వెళ్లకుండా వీరు పెళ్లి చేసేసుకున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఉన్నట్టుండి పెళ్లి వెనుక కథ ఇదే అని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇలాంటి విషయాలను బయటకు చెప్పించడంలో దిట్ట నేహా ధూపియా. ఒక టీవీ చానళ్లో టాక్‌ షో నిర్వహించే నేహా ఇలాంటి హాట్‌ గాసిప్స్‌ గురించి బాలీవుడ్‌ సెలబ్రిటీల వద్ద ఆరా తీస్తూ ఉంటుంది. అలా ఆరాతీసే నేహా తన కథను చెబుతుందా? చెప్పకపోయినా ఇది బయటపడుతుంది. ఎందుకంటే ఈ గాసిప్‌ ప్రెగ్నెన్సీ గురించి కదా! బాలీవుడ్‌ మీడియా అంచనా తప్పో రైటో త్వరలోనే తెలుస్తుంది.