క్రిష్ వచ్చె మొదలాడు

పాపం, ఏ ముహుర్తాన అనుకున్నారో ఎన్టీఆర్ బయోపిక్ ను. అప్పటి నుంచి రింగ్ రోడ్ మాదిరిగా రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎక్కడో దిగుతోంది. ఎక్కడో ఎక్కుతోంది. అసలు వస్తుందా? రాదా? అని డవుట్ కొడుతూంది.…

పాపం, ఏ ముహుర్తాన అనుకున్నారో ఎన్టీఆర్ బయోపిక్ ను. అప్పటి నుంచి రింగ్ రోడ్ మాదిరిగా రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎక్కడో దిగుతోంది. ఎక్కడో ఎక్కుతోంది. అసలు వస్తుందా? రాదా? అని డవుట్ కొడుతూంది.

ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతం, అమోఘం అన్నది నిర్మాతల్లో ఒకరైన విష్ణు నమ్మకం. ఆ స్క్రిప్ట్ ఆయనే తయారు చేసారు.. అలాంటి స్క్రిప్ట్ లో బాలయ్య వేలు పెట్టి, 50కి పైగా గెటప్ లు కనిపించాలని మార్పులు చేసారు.

సరే, తేజ రావడం వెళ్లడం అయింది. సాయి కొర్రపాటి, విష్ణు నామ మాత్రపు నిర్మాతలుగా మిగలడం అయింది. బాలయ్య స్వంత మనుషులు నిర్మాణంలోకి వచ్చారు. ఇలాంటి టైమ్ లో మహానటి రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ కథ మళ్లీ మొదటకు వచ్చింది.

తీస్తే మహానటి లెవెల్లో మంచి పేరు తెచ్చుకునేలా తీయాలి కానీ, హడావుడిగా తీయకూడదని సజెషన్లు వినిపించాయి. దాంతో బయోపిక్ తానే డైరక్ట్ చేయాలనుకున్న ఆలోచన పక్కన పెట్టి మళ్లీ డైరక్టర్ క్రిష్ ను రంగంలోకి దించే ప్రయత్నం ప్రారంభించారు.

అయితే ఇక్కడే వస్తోంది అసలు సమస్య. నిర్మాతల్లోఒకరైన విష్ణు ఇందూరి అందించిన స్క్రిప్ట్ ను పక్కన పడేయండి. సరైన స్క్రిప్ట్ తాను అందిస్తా అంటున్నాడట క్రిష్. అలా అంటే మళ్లీ కథ మొదటికి వచ్చినట్లే. క్రిష్ తన స్టయిల్ లో స్క్రిప్ట్ తయారుచేయాలి. అది బాలయ్యకు నచ్చాలి. దానికి బుర్రా మాటలు రాయాలి. ఇదంతా ఇప్పట్లో తేలే సంగతి కాదేమో?