రేంజ్‌ నిలబెట్టుకున్న ఇలియానా

ఆరేళ్ల క్రితం తెలుగు చిత్ర సీమకి దూరమై ఉత్తరాది వైపు వెళ్లిపోయిన ఇలియానా మళ్లీ తెలుగు రంగంలో అడుగుపెడుతోంది. ఇంత గ్యాప్‌ వచ్చిన హీరోయిన్‌కి మామూలుగా అయితే ఛాన్స్‌ రావడమే పది వేలు అన్నట్టుంటుంది.…

ఆరేళ్ల క్రితం తెలుగు చిత్ర సీమకి దూరమై ఉత్తరాది వైపు వెళ్లిపోయిన ఇలియానా మళ్లీ తెలుగు రంగంలో అడుగుపెడుతోంది. ఇంత గ్యాప్‌ వచ్చిన హీరోయిన్‌కి మామూలుగా అయితే ఛాన్స్‌ రావడమే పది వేలు అన్నట్టుంటుంది. కానీ తెలుగునాట అగ్ర హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా ఇన్నేళ్ల తర్వాత కూడా రేంజ్‌ నిలబెట్టుకుంది.

రవితేజ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రంతో తిరిగి పరిచయం అవుతోన్న ఇలియానాకి దీనికి గాను కోటిన్నర ప్లస్‌ ఖర్చులు ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. నిజానికి అందులో మూడొంతుల కంటే తక్కువ పారితోషికానికే అను ఎమ్మాన్యుయేల్‌ని తీసుకున్నారు. కానీ ఎందుకో ఆమెని తప్పించారు. ఆమెకి వస్తోన్న వరుస పరాజయాలే కారణమనే టాక్‌ వుంది కానీ అను మాత్రం తనకి డేట్స్‌ కుదరక వెళ్లిపోయినట్టు చెబుతోంది.

ఈ చిత్రానికి గాను ఇలియానా యాభై రోజుల బల్క్‌ డేట్స్‌ ఇవ్వాల్సి వచ్చిందట. విదేశాల్లో షూటింగ్‌ కావడంతో అన్ని రోజుల పాటు ఆమె మరో చిత్రం చేయడానికి వుండదు. మరో హిందీ చిత్రాన్ని వదులుకుని మరీ ఇందులో నటించడానికి ఒప్పుకోవడం కోసం ఇలియానా భారీగా డిమాండ్‌ చేస్తే నిర్మాతలు అందుకు సమ్మతించారట. ఈ చిత్రం గానీ క్లిక్‌ అయితే ఇలియానా కిక్‌ మళ్లీ టాలీవుడ్‌లో మొదలవుతుందని ఫాన్స్‌ ఆశ పడుతున్నారు.