Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రంగస్థలం ఎఫెక్ట్‌ ఆ సినిమాపై!

రంగస్థలం ఎఫెక్ట్‌ ఆ సినిమాపై!

రంగస్థలం చిత్రం అతి పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా చరణ్‌కి నటుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఇంతకుముందు నటనతో చరణ్‌ అద్భుతం అనిపించిన సినిమా ఏదీ లేదు. మగధీర చిత్రంలో పాత్రకి తగ్గట్టు రాణించినా కానీ సినిమా అంతటా చరణ్‌ నటన హైలైట్‌ అవలేదు. రంగస్థలం చిత్రానికి మాత్రం చరణ్‌ చాలా ప్లస్‌ అయ్యాడు.

గతంలో చరణ్‌ నుంచి అభిమానులకి నటుడిగా ఎక్కువ అంచనాలు వుండేవి కావు. కమర్షియల్‌గా అతని సినిమాలు పెద్ద విజయం సాధించడమే చాలని అనుకునేవారు. కానీ రంగస్థలం తర్వాత చరణ్‌ నుంచి స్పెషల్‌ సినిమాలు, పాత్రలు ఆశిస్తారు. ముఖ్యంగా ఈ చిత్రం తర్వాత వెంటనే రాబోయే చరణ్‌ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి.

అయితే వైవిధ్యం జోలికే పోని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ మలి చిత్రం తెరకెక్కుతోంది. బోయపాటి సినిమా అంటే ఎంత మాస్‌గా వుంటుందనేది తెలిసిందే. అతని చిత్రాల్లో హీరోల నటనకి పేరొచ్చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి.

కానీ రంగస్థలం వల్ల ఈ చిత్రం నుంచి అభిమానులు కూడా చాలానే ఆశిస్తారు. ఇప్పటికే అందుకోసం కొన్ని మార్పులు చేసారని, అయితే చిట్టిబాబుని మరిపించే విధంగా చరణ్‌ పాత్రని తీర్చిదిద్దే విషయంలో బోయపాటి కూడా ఒత్తిడికి లోనవుతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?