మైత్రీ సినిమాలు ఏమవుతాయో?

రాజా ది గ్రేట్ కు ముందు రెండుఫ్లాఫులు, వెనుక రెండు డిజాస్టర్లతో వున్నాడు హీరో రవితేజ. ఆ మాటకు వస్తే పవర్, బలుపు ముందు కూడా అయిదు భయంకరమైన సినిమాలు చేసాడు. ఇలా వరుస…

రాజా ది గ్రేట్ కు ముందు రెండుఫ్లాఫులు, వెనుక రెండు డిజాస్టర్లతో వున్నాడు హీరో రవితేజ. ఆ మాటకు వస్తే పవర్, బలుపు ముందు కూడా అయిదు భయంకరమైన సినిమాలు చేసాడు. ఇలా వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు ఇస్తున్నా పదికోట్ల మార్కెట్ మాత్రం తగ్గడంలేదు.  మైత్రీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. ఒకదానికి శ్రీనువైట్లు, రెండవ దానికి సంతోష్ శ్రీనివాస్ డైరక్టర్లు.

ఈ ఇద్దరి డైరక్టర్ల ట్రాక్ రికార్డు కూడా అలాంటిదే. వరుస ఫ్లాపులతో వున్నారు ఇద్దరూ. ఇప్పుడు ఇలాంటి డైరక్టర్లు, అలాంటి హీరోతో మైత్రీ సినిమా చేయడానికి రెడీ అయింది. శ్రీనువైట్లు సినిమాకు ఇంకా సెట్ మీదకు వెళ్లకుండానే లెక్కలు వేసేసుకుని పదికోట్లు లాభం పక్కా అని డిసైడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంత కేక్ వాక్ అనిపించడం లేదు.
 
మైత్రీకి ఎంత ఫిక్స్ డ్ బయ్యర్లు వున్నా, ఎంత క్రెడిబులిటీ వున్నా, రవితేజ సినిమా కొనడానికి బయ్యర్లు ఏమేరకు ముందుకు వస్తారు? ఎంత పెడతారు అన్నది చూడాలి. అలాగే ఆ సినిమా మైత్రీ అదృష్టం కొద్దీ ఓకె అయిపోతే సరే, తేడా వస్తే, సంతోష్ శ్రీనివాస్ సినిమాకు ఇక ఫుల్ స్టాప్ పడిపోవడం గ్యారంటీ. 

తెరమీద రాను రాను రవితేజను చూడడం కూడా కష్టంగా వుందని గ్రౌండ్ రిపోర్టు వినిపిస్తోంది. వయసు మీద పడడం, సన్నగా కావడం కోసం చేసిన ప్రయత్నాలు, అన్నీకలిసి రవితేజను పూర్తిగా డీ గ్లామర్ చేసాయి. రాజా ది గ్రేట్ లో ఆ క్యారెక్టర్ కు సెట్ అయిపోయాడు కాబట్టి చెల్లిపోయింది. కానీ టచ్ చేసి చూడు, నేలటికెట్ లో వ్యవహారం వేరుగా వుంది. ఇప్పుడు రాబోయే సినిమాల పరిస్థితి ఏమిటో?