ప్రస్తుతం మహేష్, తారక్, ప్రభాస్, చరణ్ లాంటి అగ్ర హీరోలంతా బిజీగానే వున్నారు. మరో రెండేళ్ల వరకు వీరిలో ఎవరి డేట్స్ దొరకని పరిస్థితి. అల్లు అర్జున్ మినహా స్టార్ హీరోలెవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. ఇలాంటి టైమ్‌లో డైరెక్టర్స్ అంతా అల్లు అర్జున్ కోసం క్యూ కట్టాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
ఖాళీగా వున్న స్టార్ డైరెక్టర్లు కూడా అల్లు అర్జున్ వైపు మొగ్గు చూపడం లేదు. అల్లు కాంపౌండ్‌లో ఫ్రీడమ్ అంత వుండదనే గాసిప్స్ నేపథ్యంలో అటు వైపుగా దర్శకులు ఆసక్తి చూపించడం లేదా లేక అల్లు అర్జున్‌కి సరిపడే కథ లేదా? 'నా పేరు సూర్య' పరాజయం పాలవడంతో క్రేజ్ ఫ్యాక్టర్ కూడా బన్నీకి అనుకూలంగా లేదు.
దీంతో గతంలో కాదనుకున్న విక్రమ్ కుమార్‌కే అల్లు అర్జున్ మళ్లీ కబురు పంపాడని, అతడే బన్నీ కోసం ఒక కమర్షియల్ కథ సిద్ధం చేసే పనిలో వున్నాడని సమాచారం. ఒక యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చినా కానీ 'నా పేరు సూర్య' అనుభవంతో ప్రస్తుతం కొత్త దర్శకుల వైపు అల్లు అర్జున్ అంతగా మొగ్గు చూపడం లేదని టాక్.