ఆఫీసర్ అమ్మకాలు లేవు.. పంపిణీలే

ఆర్జీవీ-నాగ్ కాంబినేషన్ లో రెడీ అయిన సినిమా ఆఫీసర్. సినిమా నిర్మాణంలో వుండగానే మే 25 డేట్ ను లాక్ చేసారు. కానీ ఆఖరికి ఓ వారం వుంది అనగా, వెనక్కు వెళ్తున్నట్లు ప్రకటించారు.…

ఆర్జీవీ-నాగ్ కాంబినేషన్ లో రెడీ అయిన సినిమా ఆఫీసర్. సినిమా నిర్మాణంలో వుండగానే మే 25 డేట్ ను లాక్ చేసారు. కానీ ఆఖరికి ఓ వారం వుంది అనగా, వెనక్కు వెళ్తున్నట్లు ప్రకటించారు. మరింత బాగా ప్రొడెక్ట్ రావడం కోసం అని ప్రకటించారు కానీ, అంతకు ముందు నుంచే వాయిదాపడుతుందని వార్తలు వినవచ్చాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా మళ్లీ వినిపిస్తోంది, ఆఫీసర్ సినిమా జూన్ 1కి కూడా రాకఫోవచ్చు అని. కోర్టు కేసులు, ఆర్థిక లావాదేవీలు వంటి కారణాలతో ఆఫీసర్ సినిమా మళ్లీ వెనక్కు వెళ్లే అవకాశాలు క్లియర్ గా వున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే సినిమాను ఎలాగైనా అమ్మడం కోసం ఏవో చిన్న చిన్న హడావుడి అయితే చేస్తున్నారు. ఇప్పటికే రెండు టీజర్లు వదిలారు. ఒక ట్రయిలర్ వదిలారు. ఏవీ కూడా ఓ స్థాయిలో లేవు. దాంతో సినిమా మీద ఏ మాత్రం వన్ పర్సంట్ అంచనాలు కూడా ఏర్పడలేదు.

దానికి తోడు ఆర్జీవీ సినిమా అంటే బయ్యర్లకు ఎప్పుడో నమ్మకాలుపోయాయి. దాంతో దీన్ని కొనేవారు లేరు. అందుకే ఎక్కడిక్కడ చిన్న చిన్న అడ్వాన్స్ ల మీద డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. ఆ విధంగా విడుదలకు అన్నీ సెట్ చేసుకున్నారు.

కానీ సమస్యలు వేరే వున్నాయని వినిపిస్తున్నాయి. అందువల్ల  జూన్ 1న అన్నా వస్తుందా? అన్నది డవుట్ గా వుంది.

మరోపక్క జయకుమార్ అనే వ్యక్తి ఆఫీసర్ కథ తనదే అంటూ హడావుడి చేయడం, అదే సమయంలో తన మీద మార్పింగ్ పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి సమస్యలు వుండనే వున్నాయి.