మొత్తానికి విక్రమ్ కె కుమార్ హీరో బన్నీకి ఓ లైన్ చెప్పేసాడు. ఇక ఫుల్ నేరేషన్ వుంది. ఇదీ బన్నీ క్యాంప్ సమాచారం. నిజానికి బన్నీ ఏం చేయాలో అర్థం కానీ సిట్యువేషన్ లో వున్నాడన్నది టాలీవుడ్ సమాచారం.
అసలు విక్రమ్ కుమార్ తో చేయాలా? వద్దా? అని డిసైడ్ కావడం లేదని తెలుస్తోంది. ఇలాంటి టైమ్ లో విక్రమ్ కుమార్ లైన్ చెప్పాడని, ఫుల్ నెరేషన్ ఇవ్వడం, అది బన్నీకి నచ్చడం బట్టి సినిమా వుండేదీ లేనిదీ తెలుస్తుందని గీతా యూనిట్ నుంచి సమాచారం అందుతోంది.
ఇలా చూసుకున్నా, ప్రస్తుతానికి బన్నీ చేతులు కట్టుకుని వుండిపోయినట్లే అనుకోవాలి. విక్రమ్ కుమార్ రావాలి. కథ చెప్పాలి. మరో డైరక్టర్ ఎవరూ లేరు. గతంలో విఐ ఆనంద్ ను, ఓ కొత్త డైరక్టర్ ను ఆప్షన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరినీ పక్కన పెట్టేసారు. లింగు స్వామి అన్నారు. అదీ డవుటే.
ఇక మిగిలిన ఆప్షన్ ఒక్క విక్రమ్ కుమార్ నే. అందుకే అతగాడు కథ చెప్పేవరకు వెయిట్ చేయడం మినహా, బన్నీ చేసేదేమీ లేదు.