అంబటి మరీ ఎక్కువ చేస్తున్నారా?

తమలపాకుతో నువ్వు ఒకటేస్తే.. తలుపు చెక్కతో నేను రెండు వేస్తా అన్నాడట వెనకటికి ఎవడో.. మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం అలాగే వుంది. Advertisement బ్రో సినిమాలో మంత్రి అంబటిని అన్యాపదేశంగా కాస్త వెటకారం…

తమలపాకుతో నువ్వు ఒకటేస్తే.. తలుపు చెక్కతో నేను రెండు వేస్తా అన్నాడట వెనకటికి ఎవడో.. మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం అలాగే వుంది.

బ్రో సినిమాలో మంత్రి అంబటిని అన్యాపదేశంగా కాస్త వెటకారం చేసారు. అతని వ్యక్తిగత వ్యవహారాలను కాదు. జస్ట్ డ్యాన్సింగ్ స్టయిల్ ను. నిజానికి వందలో యాభై మందికి కూడా అది అంబటిని ఉద్దేశించి అని చెబితే తప్ప తెలియదు. నిజానికి పృధ్వీ వేసింది అంబటి పాత్ర అని మీడియా ద్వారానే ఎక్కువ తెలిసింది. సినిమా ద్వారా కన్నా.

జనసేన అధిపతికి పవన్ కు పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, అంటే ఎందుకు కాస్త కిట్టదు. వారంతా కాపు నాయకులే. కానీ పవన్ ఎక్కువగా వాళ్లనే పవన్ టార్గెట్ చేస్తుంటారు. వాళ్లు కూడా పవన్ ను ఎక్కువగా విమర్శిస్తుంటారు. వీరిలో గంటా ఒక్కరే మిస్. ఒకప్పుడు ఆయనను కూడా కొంత టార్గెట్ చేసారు కానీ. తరువాత వదిలేసారు. బహుశా తెలుగుదేశంలో వున్నారనేమో?

మరి ఈ లెక్కనే కావచ్చు. బ్రో సినిమాలో సరైన సందర్భం లేకుండానే అంబటి రాంబాబు డ్యాన్స్ ను వెక్కిరించే పని చేసారు. నిజానికి ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అయితే ఏ సమస్యా లేదు. మామూలు సినిమా. లేదా మంచి మెసేజ్ సినిమా. ఇక్కడ అలా చేయడం వరకు మేకర్ల తప్పు.

ఆ తరువాత దీన్ని పట్టుకుని మంత్రి అంబటి తనకేదో దారుణం జరిగిపోయిందనేలా కిందా మీదా వాయించేసారు సినిమాను. నిజానికి ఇది పార్టీ ప్రతినిధులో, పార్టీ మద్దతు దారులో చేసి వుంటే బాగుండేది. మంత్రి స్థాయిలో వుండి, ఓ సాదా సీదా సినిమాను, దాని కలెక్షన్లను ప్రస్తావించి తనను తాను తక్కువ చేసుకున్నారనుకోవాలి.సరే, అక్కడికే ఎక్కువ అయింది కాస్త అనుకుంటే, ఇప్పుడు దీని మీద ఢిల్లీ వెళ్లి ఈడికి ఫిర్యాదు చేస్తామంటున్నారు.

నిర్మాతలకు తెలియదా.. ఈడి, ఇన్ కమ్ టాక్ వంటి చట్టాల గురించి. అంతర్జాతీయంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్లు వారు. వారి జాగ్రత్తలు వారికి వుండవా? పోనీ ఈ ఫిర్యాదు కూడా ఎవరు చేయాలి. పార్టీ మద్దతు దారులో, మరొకరో. మంత్రి అంబటి, వైకాపా ఎంపీలు కలిసి చేయడం అంటే. పార్టీ పరంగా చేసిన కలర్ వస్తుంది. అది అవసరమా? పైగా భాజపాతో గట్టి బంధాలు వున్న నిర్మాత. పవన్ కూడా భాజపాతో లింక్ వున్న వ్యక్తి. అందువల్ల ఇలాంటి ఫిర్యాదులతో ఒరిగేది ఏముంటుంది? జస్ట్ చేసారు అనే ఓ మాట తప్ప.

ప్రజల్లో పవన్ కు పవన్ సినిమాలకు అదనపు మైలేజీ ఇవ్వడానికి తప్ప మరెందుకు పనికి వస్తాయి ఇలాంటివి. అంబటి ఆలోచిస్తే బెటర్.

గతంలో పేర్ని నాని కూడా వకీల్ సాబ్ సినిమా టైమ్ లో కాస్త ఎక్కువ చేసి జనాల్లో విమర్శలకు గురయిన సంగతి తెలిసిందే. తరువాత మరే హడావుడి లేదు టికెట్ లు.. ఆన్ లైన్.. ఇతరత్రా వ్యవహారాల గురించి.