షర్మిల.. భారతీ ఇద్దరూ లేరు

అదిగో భూమిక అంటే ఇదిగో షర్మిల అన్నట్లుంది వ్యవహారం. ఏదో చిన్న క్యారెక్టర్ కోసం భూమికను అడిగితే, ఏకంగా షర్మిల క్యారెక్టర్ కోసమే అంటూ గ్యాసిప్ లు పుట్టుకొచ్చాయి. ఇదంతా వైఎస్ బయోపిక్ యాత్ర…

అదిగో భూమిక అంటే ఇదిగో షర్మిల అన్నట్లుంది వ్యవహారం. ఏదో చిన్న క్యారెక్టర్ కోసం భూమికను అడిగితే, ఏకంగా షర్మిల క్యారెక్టర్ కోసమే అంటూ గ్యాసిప్ లు పుట్టుకొచ్చాయి. ఇదంతా వైఎస్ బయోపిక్ యాత్ర సంగతే. మమ్ముట్టి, రావు రమేష్, తదితరులు ఫిక్స్ అయ్యారు. సూర్య కన్సెంట్ ఇచ్చాడు. యాత్ర షూట్ జూన్ 18 నుంచి ప్రారంభమవుతుంది.

ఇలా వుంటే యాత్ర మూవీలో వైఎస్ గారాలబిడ్డ షర్మిల కింద భూమిక కనిపించబోతోందంటూ వార్తలు బయటకు వచ్చాయి. కానీ అసలు సినిమాలో షర్మిల, భారతి కనిపించరే కనిపించరు అంటోంది యూనిట్. కేవలం సినిమా ప్రారంభంలో ఓ చిన్న ఫిక్షనల్ క్యారెక్టర్ కోసం భూమికను యూనిట్ అడిగినట్లు తెలుస్తోంది. కానీ భూమిక దానికి నో అన్నట్లు వినికిడి.

వైఎస్ పాదయాత్ర టైమ్ కి వైఎస్, కెవిపిలే కీలకం. మిగిలిన కుటుంబసభ్యులు కాదు. జగన్ కూడా ఆ టైమ్ లో అంత నోటెడ్ కాదు. అందుకే సినిమా స్క్రిప్ట్ ఎక్కువగా వైఎస్ రాజకీయ ప్రస్థానం చుట్టూనే తిరుగుతుంది తప్ప, ఫ్యామిలీ వ్యవహారాలు కాదని తెలుస్తోంది.

జూన్ 18న ముందుగా గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లు వగైరా సీన్లతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.