‘అను’ను ఎందుకు తీసేసారు?

బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులు చేసిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. మరో రెండు సినిమాలు చేతిలో వున్నాయి. ఒకటి చైతూ-మారుతి సినిమా మరొకటి రవితేజ-శ్రీనువైట్ల సినిమా. కానీ పాపం, ఇప్పుడు రవితేజ సినిమా…

బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులు చేసిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. మరో రెండు సినిమాలు చేతిలో వున్నాయి. ఒకటి చైతూ-మారుతి సినిమా మరొకటి రవితేజ-శ్రీనువైట్ల సినిమా. కానీ పాపం, ఇప్పుడు రవితేజ సినిమా చేజారిపోయింది. అను ఇమ్మాన్యుయేల్ స్థానంలో ఓల్డ్ హీరోయిన్ ఇలియానా వచ్చి చేరింది.

జనం ఏనాడో మరచియపోయారనుకుంటున్న ఇలియానాను మళ్లీ తీసుకురావడం సంగతి అలా వుంచితే, అసలు అన ను ఎందుకు తప్పించారన్నది క్వశ్చను. దానికి యూనిట్ జనాలు మాత్రం డేట్ల సమస్య అంటున్నారు. మారుతి సినిమాతో క్లాష్ వస్తోందని, వేరే హీరోయిన్ ను తీసుకున్నాం అంటున్నారు. అయితే అది మాత్రమేనా? రెండు ఫ్లాపులతో ముద్రపడిన అను ఎందుకని అనుకున్నారా? అన్నది అనుమానం.

అయితే చిత్రంగా అను రీప్లేస్ కోసం శృతి హాసన్ ను ట్రయ్ చేసారు నిర్మాతలు. అయితే ఎందుకో మరి సాధ్యంకాలేదు. దాంతో ఇలియానాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రవితేజ, సునీల్, ఇలియాన కాంబినేషన్ లో ముస్తాబయ్యే ఈ సినిమా జూన్ మధ్య నుంచి అమెరికాలో షూట్ మొదలు కానుంది.