త్రివిక్రమ్ మాట చెల్లడం లేదా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే హారిక హాసినిలో మోనార్క్. ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పిందే శాసనం. ఆయన ఆదేశిస్తారంతే. వారు పాటిస్తారు. ఆయన డిసైడ్ చేసే దాకా వారు వెయిట్ చేస్తారు. ముహుర్తాలు అయినా,…

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే హారిక హాసినిలో మోనార్క్. ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పిందే శాసనం. ఆయన ఆదేశిస్తారంతే. వారు పాటిస్తారు. ఆయన డిసైడ్ చేసే దాకా వారు వెయిట్ చేస్తారు. ముహుర్తాలు అయినా, మరేవయినా సరే, అంతే.

ఆయన చెప్పేదాకా, వెయిట్ చేయడం తప్ప, ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కానీ ఇప్పడు ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి అంత కేక్ వాక్ లా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకు నిజమో కానీ, గుసగుసలు అయితే కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాట చెల్లనది హారిక హాసినిలో కాదు, ఎన్టీఆర్ దగ్గర అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో సినిమాకు త్రివిక్రమ్ తన స్టయిల్ కథ చెప్పారని, దాన్ని అలా అలా ఎన్టీఆర్ కలుగ చేసుకుని, కొరటాల శివ టైపు స్టయిల్ కు మార్పించారని తెలుస్తోంది. త్రివిక్రమ్ చెప్పిన ప్రతిసారీ ఎన్టీఆర్ మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారని, దీనిపైనే చాలా కాలం నిత్యం డిస్కషన్లు నడిచాయని తెలుస్తోంది. అలాగే టైటిల్ విషయంలో కూడా చాలా జరిగినట్లు తెలుస్తోంది.

కేవలం అరవింద సమేత అన్నదే త్రివిక్రమ్ సజెస్టెడ్ టైటిల్ అని తెలుస్తోంది. అయితే వీర రాఘవ అన్న మాస్ టచ్ ఇచ్చేలా చేసింది ఎన్టీఆర్ అనే టాక్. క్లాస్ ఫస్ట్ లుక్ ఇద్దామంటే, దాన్ని మాస్ లుక్ కు మార్చింది కూడా ఎన్టీఆర్ నే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మళ్లీ మోషన్ పోస్టర్ పేరిట క్లాస్ లుక్ ను, పుట్టిన రోజు శుభాకాంక్షల పేరిట మరో యూత్ లుక్ ను విడుదల చేసారని వినికిడి.

నిజానికి త్రివిక్రమ్ అనుకున్నది యూత్ ఫుల్ లవ్ స్టోరీనే తీయాలని, కానీ తెరవెనుక ఎన్టీఆర్ ఎవరి సలహాలు తీసుకుంటున్నారో కానీ, త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి మార్పులు చేర్పులు చెబుతూ దాన్ని కొరటాల శివ టైపు స్టోరీలోకి మార్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు ఎంత ఎక్స్ ట్రీమ్ గా వినిపిస్తున్నాయంటే, ఇప్పటికీ సినిమాకు స్టోరీ ఫైనల్ గా లాక్ కాలేదని వినిపిస్తోంది.

మరోపక్క ఇలా సిక్స్ ప్యాక్, కత్తి పట్టుకుని, రక్తం ఓడించడంతో ఓవర్ సీస్ మార్కెట్ దెబ్బతినే ప్రమాదం వుందని, ఇలాంటివి ఓవర్ సీస్ లో నడవవని, త్రివిక్రమ్ స్టయిల్ క్లాస్ వుంటేనే అక్కడ మార్కెట్ వుంటుందని మరోపక్క టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ లుక్ వదలడం వల్ల ఓవర్ సీస్ మార్కెట్ కచ్చితంగా అనుమానంలో పడుతుందని అంటున్నారు.

మొత్తం మీద ఫస్ట్ లుక్, టైటిల్, కథకే ఇంత కిందా మీదా అయితే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా పై ముందు ముందు మరెన్ని గ్యాసిప్ లు పుడతాయో?