ఆ హీరోతో ఎవ్వరూ చేయనంటున్నారా?

టాలీవుడ్ కు హీరోయిన్ల సమస్య చాలా ఎక్కువ. అది అందరికీ తెలిసిందే. కొత్త హీరోయిన్లు అంటే అద్భుతంగా వుంటే తప్ప ఓకె కావడం లేదు. ఉన్నవారంతా చకచకా అందరితో సినిమాలు చేసేస్తూ బోర్ కొట్టేస్తున్నారు.…

టాలీవుడ్ కు హీరోయిన్ల సమస్య చాలా ఎక్కువ. అది అందరికీ తెలిసిందే. కొత్త హీరోయిన్లు అంటే అద్భుతంగా వుంటే తప్ప ఓకె కావడం లేదు. ఉన్నవారంతా చకచకా అందరితో సినిమాలు చేసేస్తూ బోర్ కొట్టేస్తున్నారు. ఆఖరికి మీడియం, చిన్న హీరోల వరకు వచ్చి, పక్కకు తప్పుకుంటున్నారు. అయితే ఓ చిన్న హీరోకి మాత్రం విచిత్రమైన సమస్య వస్తోందని వినికిడి.

ఆ హీరో అంటే ఏ హీరోయిన్ కూడా చేయడానికి అంతగా ఇష్టపడడం లేదట. ఏదో వంక పెట్టి తప్పించుకుంటున్నారట. అటు చిన్న హీరో కాదు, ఇటు మిడిల్ హీరో కాదు. ఎటువంటి ఫ్యామిలీ బ్యాకింగ్ లేకున్నా 10 కోట్ల మార్కెట్ అయితే వుంది. కాస్త వైవిధ్యమైన సినిమాలు చేస్తాడన్న పేరు వుంది. కానీ హీరోయిన్లు మాత్రం ఎందుకో ఓకె అనడం లేదట. ఈ హీరోకి ప్రస్తుతం వున్న ఒకే ఒక సినిమాకు హీరోయిన్ ను సెట్ చేయడానికి నిర్మాతలు తల పట్టుకోవాల్సి వచ్చిందని వినికిడి.

నలుగురు హీరోయిన్లను ట్రయ్ చేసి, ఆఖరికి 'ఆ హీరోయిన్ నా' అన్న కామెంట్లు వినిపించినా, ఓ ముదురు హీరోయిన్ ను ఆ కుర్ర హీరో పక్కన సెట్ చేసి,హమ్మయ్య అనిపించుకున్నారట. మాంచి క్రేజ్ వున్న క్యూట్ గా, ముద్దుగా వుండి, ఒకే ఒక్క సినిమా చేసిన హీరోయిన్ కు, అయిదు లక్షల అడ్వాన్స్ చెక్ ఇచ్చారట. వారం రోజుల తరువాత చెక్ వెనక్కు ఇచ్చి, చేయలేను, సారీ అనేసిందట ఆ అమాయకపు మొహం అమ్మడు.

ఇవన్నీ హీరోకు చెప్పలేక, అలా అని మరో హీరోయిన్ ను సెట్ చేయలేక, తెలుగులో సినిమాలే లేని, ముదురు మొహం హీరోయిన్ ను ఈ లేత మొహం కుర్ర హీరోపక్కన సెట్ చేసి, షూటింగ్ మీదకు వెళ్లిపోతున్నారట. అవును, ఇంతకీ హీరోయిన్లు అంతా ఈ హీరో పక్కన ఎందుకు చేయమని అంటున్నారో?