బాలయ్య అంటే మాస్ యాక్షన్ అండ్ డైలాగ్స్. పరుచూరి అంటే మాస్ డైలాగులు. మరి వినాయక్ అంటే మాస్ కే మాస్. ఇలాంటి ముగ్గురు మాస్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ నెల ఆఖరి వారంలో 25 లేదా 27న ప్రారంభం కాబోతోంది.
25 లేదా 27న పూజ చేసి, వచ్చే నెల మొదటి వారం నుంచి షూటింగ్ కు వెళ్లిపోతారు. సినిమా చేసి లాభాలు చవి చూసిన నిర్మాత సి కళ్యాణ్ నే ఈ కాంబినేషన్ కు నిర్మాత. జై సింహా తరువాత ఎన్టీఆర్ బయోపిక్ కే వెళ్తారు అనుకున్న బాలయ్య, రూటు మార్చి వినాయక్ సినిమా మీదకు వస్తున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ కు సవాలక్ష సమస్యలు వచ్చి పడ్డాయి. తేజ తప్పుకున్నారు. మహానటి సినిమా చూస్తే, నభూతో..న భవిష్యతి అన్నట్లు తయారైంది. క్రిష్ అవును..కాదు అంటూ ఊగిసలాడుతున్నారు. అందుకే బాలయ్య ముందుగా ఓ మాస్ సినిమాకు కమిట్ అయిపోయారు. ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేసి, వీలయినంత త్వరగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
చాలా కాలం తరువాత పరుచూరి బ్రదర్స్ బాలయ్య కోసం డైలాగులు రాయబోతున్నారు. అందునా వివి వినాయక్ సినిమాకు. అందువల్ల కచ్చితంగా పవర్ ఫుల్ గా రాస్తారు అనే అనుకోవాలి. మరి చకచకా రెడీ చేసి దసరాకు ఎన్టీఆర్ సినిమాకు పోటీగా దిగుతారో? లేక సంక్రాంతికి టార్గెట్ చేసి బోయపాటి-రామ్ చరణ్ సినిమాకు పోటీగా వుంటారో చూడాలి.