బాలయ్యకు ఎవరు చెబుతారు?

తెలుగులో తొలి బయోపిక్ మహానటి వచ్చేసింది. ఓ బయోపిక్ అంటే ఇలా వుండాలి. ఇంత క్వాలిటీ ఆఫ్ మేకింగ్ వుండాలి. ఇంత నిజాయతీ వుండాలి. ఇంత నిర్మొహమాటంగా వుండాలి. అన్నింటికి మించి సినిమాలో నటులు…

తెలుగులో తొలి బయోపిక్ మహానటి వచ్చేసింది. ఓ బయోపిక్ అంటే ఇలా వుండాలి. ఇంత క్వాలిటీ ఆఫ్ మేకింగ్ వుండాలి. ఇంత నిజాయతీ వుండాలి. ఇంత నిర్మొహమాటంగా వుండాలి. అన్నింటికి మించి సినిమాలో నటులు కనిపించకూడదు. 

ఇప్పుడు ఇక లైన్ లో మరో రెండు బయోపిక్ లు వున్నాయి. ఒకటి వైఎస్ యాత్ర. రెండు ఎన్టీఆర్ బయోపిక్. వైఎస్ యాత్ర బయోపిక్ కేవలం కొంతవరకు మాత్రమే తీసుకుంటున్న కథ. దీనికి మమ్ముట్టిని తీసుకున్నారు. అక్కడే సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాకు టైటిల్ యాత్ర అని పెట్టి, పాదయాత్రకు కాస్త అటుగా ప్రారంభించి, సిఎమ్ పదవితో క్లోజ్ చేస్తారు కాబట్టి, చూపించాల్సినవి చూపించలేదు అనే మాట రాదు.

కానీ ఎన్టీఆర్ బయోపిక్ అలా కాదు. చిన్న నాటి నుంచి సిఎమ్ అయ్యేవరకు అంటున్నారు. నిజానికి ఆ తరువాతే ఎన్టీఆర్ జీవితంలో అసలైన మలుపులు, ఉథ్ధాన పతనాలు వున్నాయి. అవేమీ చూపించకుండా, కేవలం ఎన్టీఆర్ వేసిన 50నుంచి 60పాత్రలను మాత్రం చూపించడం అంటే, బయోపిక్ అనిపించుకోదు. కేవలం బాలయ్య సరదా తీర్చుకోవడం అవుతుంది. అంతే కానీ ఎన్టీఆర్ ను తెరపైకి తీసుకురావడం కాదు.

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్య ఏ తరహా ఆలోచనలతో వున్నా, ఇప్పుడు మాత్రం కచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే మహానటితో బయోపిక్ లకు ఓ గైడ్ ను తయారుచేసిపెట్టాడు నాగ్ అశ్విన్. తీయగలిగితే అలా నిజాయతీగా తీయాలి. లేదూ అంటే సైలంట్ గా వుండిపోవాలి. అయినా నాగ్ అశ్విన్ తీసిన మహానటి చూసిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ఎవరు తీయగలరు అలా? అయితే క్రిష్ తీయాలి. అది కూడా బాలయ్య నూటికి నూరు శాతం ప్రీడమ్ ఇస్తేనే.