ఎక్స్‌క్లూజివ్: బన్నీ కోసం వస్తున్న పవన్

మెగా హీరోలంతా ఒక్కటే. గతంలో ఎప్పుడో చిన్న చిన్న కనిపించని విబేధాలు వుండేవేమో కానీ, ఇప్పుడు అంతా ఒక్క మాట మీదకు, ఒక్క తాటి మీదకు వచ్చేసారు. మొన్నటికి మొన్న బన్నీ సినిమా నా…

మెగా హీరోలంతా ఒక్కటే. గతంలో ఎప్పుడో చిన్న చిన్న కనిపించని విబేధాలు వుండేవేమో కానీ, ఇప్పుడు అంతా ఒక్క మాట మీదకు, ఒక్క తాటి మీదకు వచ్చేసారు. మొన్నటికి మొన్న బన్నీ సినిమా నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. ఇప్పడు పవర్ స్టార్ రాబోతున్నారు.

నా పేరు సూర్య విడుదలయి మరో రెండు రోజులకు వారం అవుతుంది. డివైడ్ టాక్ వున్న వీకెండ్ తరువాత కూడా కలెక్షన్లు పరవాలేదు అనే రేంజ్ లో వున్నాయి. అందుకే ఈ కలెక్షన్లను స్టడీగా వుంచేందుకు, ఫ్యాన్స్ కు ఆనందం కలిగించేందుకు, మలివారం ప్రచారానికి బలం తెచ్చేందుకు ఓ సక్సెస్ మీట్ ప్లాన్ చేసారు.

ఈనెల 10న ఆ సక్సెస్ మీట్ వుంటుంది. ఈ సక్సెస్ మీట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈవిషయాన్ని యూనిట్ ఈసాయంత్రం 5.30కు ప్రత్యేకంగా ప్రకటించబోతోంది.