జనసేనకు ఆ నిర్మాత ఫండింగ్?

ఏ పార్టీకైనా ఫండింగ్ అన్నది కామన్. అయితే సినిమా జనాలు, కాస్త క్రేజ్ వున్న వాళ్లు పార్టీ పెడితే ఫండింగ్ చేసే వాళ్లు ఎప్పుడూ వుంటారు. ఎక్కడో ఒక దగ్గర టికెట్ ఆశించి కావచ్చు,…

ఏ పార్టీకైనా ఫండింగ్ అన్నది కామన్. అయితే సినిమా జనాలు, కాస్త క్రేజ్ వున్న వాళ్లు పార్టీ పెడితే ఫండింగ్ చేసే వాళ్లు ఎప్పుడూ వుంటారు. ఎక్కడో ఒక దగ్గర టికెట్ ఆశించి కావచ్చు, మరో విధమైన వ్యవహారాలు వుండొచ్చు. తెరవెనుక ఫండింగ్ కామన్.

జనసేనకు ఆవిర్భావ సమయంలో నిర్మాత పివిపి ఫండింగ్ చేసారన్నది బహిరంగ రహస్యం. ఆయన అప్పట్లో విజయవాడ ఎంపీ సీట్ ఆశించారు. కానీ పవన్ ఎంత ట్రయ్ చేసినా, చంద్రబాబు సహకరించక అది సాధ్యం కాలేదు. తరువాత పివిపి జనసేనకు దూరం అయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లు పార్టీ అలాఅలా నడిచింది. ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలు కాస్త ఊపందుకున్నాయి.

ఇప్పుడు పలువురు తలో చేయి వేయాల్సిన అవసరం వుంది. అలా చేయి వేస్తున్న వారిలో ఓ అప్ కమింగ్ నిర్మాత వున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నిర్మాత ఇప్పటికే ఓ చిన్న సినిమా తీసి దెబ్బతిన్నారు. ఎన్నారై అయిన ఈ నిర్మాత ఇప్పుడు మరో సినిమా తీస్తున్నారు.

ఆ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతోందని తెలుస్తోంది. ఆయన ఇప్పుడు జనసేనకు చాలా దగ్గరగా వుంటున్నారట. ఎంత దగ్గరగా అంటే, జనసేనకు ఫండింగ్ చేయడం, జనసేన వ్వవహారాలు కొన్ని తన ఆఫీసు నుంచి నడిపించడం, జనసేన మనుషులనే తన సినిమాకు కూడా నియమించడం వరకు అంట.

హీరో తన మనిషిని పెట్టుకోమని చెప్పినా కాదని, జనసేన మనిషిని తేవడంతో ఆశ్చర్యపోవడం ఆ హీరో వంతయిందట. ఏమిటిదంతా? అని ఆ హీరో ఆరా తీసి, ఈ జనసేన లింక్ లు తెలిసాక, గమ్మున వున్నాడట. అన్నట్లు సినిమాకు దర్శకుడు కూడా జనసేన మాజీ మాతృసంస్థలాంటి ప్రజారాజ్యంతో ఒకప్పుడు సంబధాలు వున్నవారే కావడం విశేషం.