టాక్సీవాలా వెనక్కు.. నా నువ్వే ముందుకు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సైకలాజికల్, సైంటిఫిక్ థ్రిల్లర్ టాక్సీవాలా సినిమా వాయిదా పడేటట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను యువి, దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాస్ లాంటి పెద్దల సహకారంతో ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.…

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సైకలాజికల్, సైంటిఫిక్ థ్రిల్లర్ టాక్సీవాలా సినిమా వాయిదా పడేటట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను యువి, దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాస్ లాంటి పెద్దల సహకారంతో ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. అయితే ఫినిషింగ్, సిజి వర్క్ లు పూర్తి కాకపోవడంతో రెండువారాలు వెనక్కు జరిపేటట్లు కనిపిస్తోంది వ్యవహారం.

దీంతో కళ్యాణ్ రామ్-తమన్నాలతో నిర్మించిన నా నువ్వే ఆ అవకాశాన్ని వాడుకునేటట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ఈనెల 25షెడ్యూలు చేసారు. ఆ రోజు రవితేజ నేలటికెట్, నాగార్జున ఆఫీసర్ కూడా వున్నాయి. ఇప్పుడు వన్ వీక్ ముందుకు వస్తే సోలో డేట్ దొరికినట్లు అవుతుంది. అయితే సెన్సారు కార్యక్రమాలు అవీ వున్నాయి. వాటిని బట్టి ముందుకు రావడం అన్నది డిపెండ్ అయివుంది.

ఈ నెల 11తో పెద్ద సినిమాల తాకిడి అయిపోతుంది. మహానటి, మెహబూబా అయిపోతే ఇక హడావుడి వుండదు. నేలటికెట్, ఆఫీసర్ సినిమాలకు పెద్దగా బజ్ లేదు. దగ్గరకు వచ్చేసరికి ఏమైనా హల్ చల్ చేస్తాయేమో చూడాలి. ఇలాంటి టైమ్ లో 18న సోలో డేట్ దొరకడం కాస్త లక్కీనే 'నా నువ్వే' సినిమాకు.