అను.. ఫోన్ ఆన్సర్ ప్లీజ్?

సినిమాకు సైన్ చేసి, పారితోషికం తీసుకున్నాక, కేవలం నటించి వెళ్లిపోతాం అంటే కుదరదు. సినిమాకు ప్రమోషన్ కూడా చేయాలి. కానీ మన భారీ సినిమాల హీరోయిన్లు ఒక కాలు ముంబాయిలో, మరో కాలు చెన్నయ్…

సినిమాకు సైన్ చేసి, పారితోషికం తీసుకున్నాక, కేవలం నటించి వెళ్లిపోతాం అంటే కుదరదు. సినిమాకు ప్రమోషన్ కూడా చేయాలి. కానీ మన భారీ సినిమాల హీరోయిన్లు ఒక కాలు ముంబాయిలో, మరో కాలు చెన్నయ్ లో పెడుతుంటారు. మధ్య మధ్యలో టాలీవుడ్ ను చుట్టపు చూపు చూసి పోతుంటారు. అన్ని భాషల్లో నటించాల్సి రావడంతో ప్రమోషన్ తమ బాధ్యత కాదన్నట్లు ప్రవర్తిస్తుంటారు.

అయితే తెలుగు కెరీర్ మీద సీరియస్ దృష్టి వున్నవారు మాత్రం ప్రమోషన్లకు కాదు అనరు. అయితే అను ఇమ్మాన్యుయేల్ వ్యవహారం వేరుగా వున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఇప్పటికి అజ్ఞాతవాసి లాంటి భయంకరమైన ఫ్లాప్ ఇచ్చింది. అజ్ఞాతవాసి సమయంలోనే నాపేరు సూర్య, శైలజరెడ్డి అల్లుడు సినిమాలకు సైన్ చేసింది.

గతవారం నా పేరు సూర్య సినిమా విడదుల అయింది. కానీ అను ఇమ్మాన్యుయేల్ మాత్రం ఆ సినిమా ప్రమోషన్లకు పూర్తిగా డుమ్మా కొట్టేసింది. అలా అని మరో సినిమా షూటింగ్ ఏమన్నా వుందా? అంటే అదీ లేదు. హీరోయిన్ లేకపోతే, టీవీ ప్రమోషన్ డిస్కషన్లకు కళ వుండదు. కానీ అను కోసం సూర్య యూనిట్ ట్రయ్ చేస్తుంటే, ఫోన్ నో రిప్లయ్ వస్తోందట. ఎక్కడ వుందో తెలియడం లేదట.

ఇక ఆ సినిమాకు ప్రమోట్ చేయాలంటే బన్నీ మినహా మరొకరు కనిపించడం లేదు. దాంతో ఏం చేయాలో తెలియక యూనిట్ కిందా మీదా అవుతోంది.