వెంకీతో తమన్నా.. వరుణ్ తో మెహరీన్

సీనియర్ హీరో వెంకీకి హీరోయిన్ దొరికేసింది. తెలుగులో ఆల్ మోస్ట్ ముగిసిపోయి, లాస్ట్ రౌండ్ సినిమాలు చేస్తున్న తమన్నాను హీరోయిన్ గా ఓకె చేసారు. ఈ మధ్యనే తమన్నా హీరో కళ్యాణ్ రామ్ తో…

సీనియర్ హీరో వెంకీకి హీరోయిన్ దొరికేసింది. తెలుగులో ఆల్ మోస్ట్ ముగిసిపోయి, లాస్ట్ రౌండ్ సినిమాలు చేస్తున్న తమన్నాను హీరోయిన్ గా ఓకె చేసారు. ఈ మధ్యనే తమన్నా హీరో కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా ఫినిష్ చేసింది. ఆ సినిమా ఇంకా విడుదల కావాల్సి వుంది. దాని తరువాత ఈ సినిమా ఓకె చేసింది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే మల్టీ స్టారర్ సినిమాలో వెంకీ-వరుణ్ తేజ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు హీరోలకు ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేసారు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ పక్కన మెహరీన్ ను ఎంపిక చేసారు. అనిల్ రావిపూడి ఇప్పటికే మెహరీన్ తో చేసారు. మళ్లీ ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నారు.

వచ్చే నెల నుంచి కంటిన్యూగా షూటింగ్ మీదకు వెళ్తే ఈ సినిమా మీద కాస్త ఆసక్తి వుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు వరుసగా హిట్ లు కొట్టడం, మల్టీ స్టారర్ కావడం, దిల్ రాజు నిర్మాత కావడం అన్నది కీలకం. అలాగే ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు.