ఇవి కొరటాల పర్సనల్

టాలీవుడ్ లో టాప్ డైరక్టర్ ఎవరు అంటే, రాజమౌళితో పాటు వినిపించే పేరు కొరటాల శివ. ఆ తరువాతే ఇంకెవరు అయినా. కారణం, ఆ ట్రాక్ రికార్డు అలాంటిది. అతని రెమ్యూనిరేషన్ అలాంటిది. సక్సెస్…

టాలీవుడ్ లో టాప్ డైరక్టర్ ఎవరు అంటే, రాజమౌళితో పాటు వినిపించే పేరు కొరటాల శివ. ఆ తరువాతే ఇంకెవరు అయినా. కారణం, ఆ ట్రాక్ రికార్డు అలాంటిది. అతని రెమ్యూనిరేషన్ అలాంటిది. సక్సెస్ రేట్ అలాంటది. ఈ ఇద్దరి తరువాతే అసలు జాబితా ప్రారంభమవుతుంది. సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి, వంశీ పైడిపల్లి ఇలా. హీరోలకు, బయ్యర్లుకు ఓ భరోసా ఇచ్చే వాళ్లే టాప్ డైరక్టర్ల జాబితాలోకి వస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో పైన వున్నాడు కొరటాల శివ.

అలాంటి దర్శకుడి గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవాలని సినిమా అభిమానులకు వుంటుంది. అందులోనూ, తెలిసిన వాటికన్నా, తెలియని వాటిని తెలుసుకోవాలని మరీ వుంటుంది. అందుకే ఇక్కడ పేర్కోంటున్నవి, కొరటాల పర్సనల్స్ అయినా కూడా అభిమానించే జనాల కోసం.

*కొరటాల శివ దంపతులు భలే చిత్రమైన జంట. కొరటాల శివ ఫ్యామీలీ ఫ్యామిలీ అంతా కమ్యూనిస్ట్ నేఫథ్యం నుంచి వచ్చారు. 

కానీ ఆయన భార్య, అత్తింటివారు అంతా ఫిలాసఫీ, హిందూత్వ, సేవ వంటి వైపు ప్రగాఢ విశ్వాసాలు వున్నవారు. వారంతా రామకృష్ణ మిషన్ ఫాలోవర్స్. అత్తింటి వైపు వారందరి పేర్లు కూడా రామకృష్ణ మిషన్ ను గుర్తుచేసేవే. 

*కొరటాల శివ-ఆయన భార్యకు ఇద్దరికీ ఈ సొసైటికీ ఏదో చేయాలన్న బలమైన ఆలోచన వుంది. అందుకే తరచు రామకృష్ణ మిషన్ కు వెళ్తుంటారు. వారి కార్యక్రమాలకు అండగా వుంటారు.

*కేవలం ఆరేడు సినిమాలు మాత్రమే చేసి, ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలన్నది కొరటాల ఆలోచన. ఇది ఆయన అభిమానులకు నచ్చకపోవచ్చు. కానీ నిజం. మహా అయితే మరో మూడేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో వుండాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన భార్య అయితే ఇప్పుడే సినిమాలు ఆపేసినా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు.

*సమాజానికి, సేవా మార్గానికి ఏదైనా చేయాలని, ఆ మార్గంలో పయనించడానికి తమకు ఎటువంటి భవబంధాలు, ఎగస్ట్రా బ్యాగేజ్ వుండకూడదని, దంపతులు ఇద్దరూ ముందుగానే అనుకున్ని, పిల్లలను వద్దనుకుని, ఆ ఇద్దరే, నాకు నువ్వు, నీకు నేను అన్నట్లు వుండిపోయారు.

*సాధారణంగా రెస్ట్ తీసుకోవాలంటే సెలబ్రిటీలు యుకె, యుఎస్, దుబాయ్ అంటూ విలాసం వైపు వెళ్తే, భరత్ అనే నేను తరువాత కొరటాల దంపతులు భూటాన్ లోని బుద్దిస్ట్ మానెస్ట్రీల్లో ఎనిమిది రోజులు గడపడానికి వెళ్లారు. ఆపైన నేపాల్, ఇండోనేషియాలోని డివోషనల్ ప్లేసెస్ చూసి, ఉత్తరకాశీలోని ఆశ్రమంలో ఓ నెల గడపాలని డిసైడ్ అయ్యారు.

*కొరటాల సతీమణి ఇద్దరు సోదరులు ఉన్నతమైన చదువులు చదువుకుని, సేవా మార్గంలో భాగంగా సన్యాసదీక్ష తీసుకోవడం విశేషం.

*సినిమాల్లో సంపాదించిన డబ్బుతో ఓ మాంచి ఐడియాలజీతో కూడిన గురుకులాలు ఏర్పాటు చేసి, మూడు నాలుగో ఏట నుంచే విద్యార్థులను తీసుకుని, మాంచి నైతికత, విలవులతో కూడిన విద్యను పూర్తిగా ఉచితంగా నేర్పేలా చేసే ఆలోచన కొరటాలకు వుంది. ఇంకా ఏదైనా చేయాలి? ఎలా చేయాలి? అన్న ఆలచోనలతో వున్నారు. అవన్నీ కేవలం మరో మూడు సినిమాలు చేసి, ఫీల్డ్ ను వదిలేసి, ఈ ఫీల్డ్ తో అస్సలు సంబంధంలోని వేరే ప్రపంచంలోకి వెళ్లాక.

*డబ్బులు కావాలి. సంపాదించాలి అన్నది, వచ్చిన అవకాశాన్ని వాడి, చేయ గలిగింది చేయడం కోసం అంటారు కొరటాల. 

ఇవీ కొరటాల పర్సనల్స్. కొందరినైనా ఆలోచింప చేస్తే కాస్త మంచిదే.