దిల్ రాజు బ్యానర్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసుకున్నానని, తన నెక్ట్స్ సినిమా అదేనంటూ చాన్నాళ్ల కిందట ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ సినిమాకు దాగుడు మూతలు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. లొకేషన్ల కోసం అమెరికా కూడా చుట్టొచ్చాడు. ఇన్ని వ్యవహారాల్ని పూర్తిచేసిన హరీష్, ఎందుకు ఇప్పుడు సెడన్ గా సైలెంట్ అయిపోయాడు?
దాగుడు మూతలు సినిమాకు సంబంధించి ప్రస్తుతం దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. అడిగితే, “మహేష్ తో మూవీ ఉందిగా దానిపై ఏమైనా రాయండి, దాగుడు-మూతలు గురించి అప్పుడే ఎందుకు” అనే సమాధానం వస్తోంది. మరోవైపు హరీష్ ను అడిగితే తనకేం సంబంధం లేదని దిల్ రాజునే అడగమని అంటున్నాడు. వీళ్లిద్దరి వ్యవహారం చూస్తుంటే.. టైటిల్ కు తగ్గట్టే దాగుడు-మూతలు ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
ఈ సినిమాలో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటించడానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ బిజీ. శ్రీనివాసకల్యాణం సినిమాతో నితిన్ బిజీగా ఉంటే.. శర్వానంద్ ఏకంగా ఒకేసారి 2సినిమాలు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ కొలిక్కి వచ్చే టైమ్ కు మహేష్ బాబు సినిమాతో దిల్ రాజు బిజీ అయిపోతాడు.
సో.. దాగుడు-మూతలు ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ నుంచి ఖాళీగా ఉన్నాడు హరీష్ శంకర్.