ఎన్టీఆర్‌ లెక్క తప్పలేదు

జనతా గ్యారేజ్‌ తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది. అది వుందనే ఆశతో వక్కంతం వంశీ చాలా నమ్మకంగా ఎదురు చూసాడు. కానీ ఎన్టీఆర్‌ చివరి నిమిషంలో ఆ కథ…

జనతా గ్యారేజ్‌ తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ సినిమా కన్‌ఫర్మ్‌ అయిపోయింది. అది వుందనే ఆశతో వక్కంతం వంశీ చాలా నమ్మకంగా ఎదురు చూసాడు. కానీ ఎన్టీఆర్‌ చివరి నిమిషంలో ఆ కథ చేయనని చెప్పాడు. వేరే కథ తీసుకురమ్మంటే, ఆ కథతోనే దర్శకుడిగా పరిచయం కావాలని అనుకుంటున్నానంటూ వక్కంతం వంశీ మొండికేయడంతో ఎన్టీఆర్‌ డ్రాప్‌ అయ్యాడు.

అన్ని రోజులు ఆశ పెట్టి అలా వదిలేయడం కరక్ట్‌ కాదంటూ ఎన్టీఆర్‌ని చాలా మంది తప్పుబట్టారు. ఎన్టీఆర్‌ కాదన్న ఆ కథే అల్లు అర్జున్‌ దగ్గరకి వెళ్లింది. అతను వెంటనే ఓకే చేసి 'నా పేరు సూర్య' పట్టాలెక్కించాడు.

ఈ సినిమా చూసిన వారికి ఎన్టీఆర్‌ ఇంతకుముందు చేసిన 'టెంపర్‌' ఛాయలున్నాయనిపిస్తోంది. టెంపర్‌ కథ రాసింది కూడా వక్కంతం వంశీనే. ఆ కథతోనే దర్శకుడు అవుదామని అనుకున్నాడు కానీ ఎన్టీఆర్‌ కోరడంతో కథ పూరీకి ఇచ్చేసాడు.

ఆ స్థానంలో రాసిన 'నా పేరు సూర్య' కథ కూడా అదే మీటర్‌లో రాసినట్టున్నాడు. సహజంగానే అది ఎన్టీఆర్‌ని ఎక్సయిట్‌ చేయలేదు. అతను డ్రాప్‌ అయిపోవడంతో అల్లు అర్జున్‌కి ఇలాంటి పాత్ర కొత్త కనుక చేసేసాడు.

అతని మీదే డివైడ్‌ టాక్‌తో ఓపెన్‌ అయిన ఈ చిత్రం ఎన్టీఆర్‌కి అయితే మరింత బ్యాడ్‌ టాక్‌ వచ్చేదేమో. మళ్లీ టెంపరే వేరేలా చేసారని అనేవారేమో. మొత్తానికి తారక్‌ ఈ చిత్రం విషయంలో కరక్ట్‌గానే ఆలోచించాడు. కాకపోతే దీనికి బదులుగా చేసిన 'జై లవకుశ' కూడా పెద్దగా ఆడలేదనుకోండి. అది వేరే విషయం.