ఎన్టీఆర్ సినిమాకు వాస్తుదోషం?

సినిమా రంగంలో నమ్మకాలు, వాస్తు, ముహుర్తాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది నందమూరి బాలయ్య బాబే. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు ఆస్థాన వాస్తు, జ్యోతిష పండితులు వున్నారు. ఆయన పుణ్యమా అనే, చంద్రబాబుకు కూడా…

సినిమా రంగంలో నమ్మకాలు, వాస్తు, ముహుర్తాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది నందమూరి బాలయ్య బాబే. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు ఆస్థాన వాస్తు, జ్యోతిష పండితులు వున్నారు. ఆయన పుణ్యమా అనే, చంద్రబాబుకు కూడా వాస్తు, జ్యోతిష్య నమ్మకాలు అలవాటయ్యాయి.

సరే ఆ సంగతి అలా వుంచితే, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు వేస్తుంటే, సందేహం వచ్చి వాస్తుచెక్ చేయించారట బాలయ్య. ఎలా అంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ బయోపిక్ ఆఫీస్ ప్రశాశన్ నగర్ లో వుంది. వాస్తవానికి ఇది వేరే నిర్మాత ఆఫీసు. ఆ నిర్మాత సినిమాలు నిర్మించి కాస్త గట్టి దెబ్బలు తిన్నారు. దాంతో ఓ ఫ్లోర్ ఎన్టీఆర్ బయోపిక్ యూనిట్ కు ఇచ్చారు.

ఇప్పుడు ఈ ఆఫీస్ కే బాలయ్య వాస్తు తనిఖీలు చేయించారట. చేయిస్తే, అస్సలు వాస్తు బాగా లేదని తేలిందట. దాంతో ఇప్పుడు మరో ఆఫీస్ కోసం వెదుకుతున్నారు. ఆల్ మోస్ట్ దొరికిందని, ఇక షిప్ట్ కావడం ఖాయమని తెలుస్తోంది.