దాదాపు ఏడాది కాలంగా తెలుగు సినిమా స్టామినా పెరుగుతూ వస్తోంది. బాహుబలి సంగతి పక్కన వుంచితే మిగిలిన భారీ సినిమాలు కూడా 80నుంచి వంద కోట్ల మార్కెట్ చేయడం అన్నది కామన్ అయింది.
ఈ సమ్మర్ వరకు చూసుకుంటే రంగస్థలం 80కోట్ల మేరకు థియేటర్ రైట్లు అమ్మగలిగారు. భరత్ అనే నేను 98కోట్ల మేరకు అమ్మగలిగారు. ఆ విధంగా లెక్క వేసుకుంటే, నా పేరు సూర్య కూడా 80కోట్లకు పైగా థియేటర్ రైట్స్ బిజినెస్ చేసింది. రంగస్థలం ముఫై కోట్లకు పైగా శాటిలైట్, డిజిటల్ డబ్బింగ్ హక్కులు తెచ్చుకుంది. నా పేరు సూర్య 26కోట్ల వరకు తెచ్చుకుంది.
భరత్ అనే నేను 22కోట్లకు అడ్వాన్స్ మీద నైజాంలో ఓన్ రిలీజ్ చేసుకుంటే, నా పేరు సూర్య అమెరికాలో అడ్వాన్స్ మీద ఓన్ రిలీజ్ చేసుకుంటోంది. అలా మొత్తం మీద చూసుకుంటే 84కోట్ల వరకు థియేటర్ బిజినెస్ కాలుక్యులేషన్ వస్తోంది. అంటే రంగస్థలం కంటే ఎక్కవ, భరత్ అనేనేను కంటే తక్కువ అనుకోవాలి. ఆంధ్రలో కూడా దాదాపు ఇదే పరిస్థితి వుంది. భరత్ అనే నేనుకు దగ్గరగా, రంగస్థలంకు కాస్త అటుగా అమ్మకాలు జరిగాయి.
నైజాం….. 21
సీడెడ్…… 12
ఉత్తరాంధ్ర….. 8
ఈస్ట్…… 5.4
వెస్ట్…… 4.2
కృష్ణ….. 5
గుంటూరు…. 5.5
నెల్లూరు…… 2.52