భరత్ అనే నేనుకు అర్బన్ సెంటర్లు, ఓవర్ సీస్ లో కేవలం కలెక్షన్లు మాత్రమే కాకుండా మాంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఓవర్ సీస్ లో మూడు మిలియన్ల మార్క్ దాటేసింది. వాస్తవానికి అమెరికాలో ఈసినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి వుంది.
అవెంజర్స్ సినిమా రాకపోయి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కానీ అది వచ్చి కొంత దెబ్బతీసింది. అయితే భరత్ విడుదలకు ముందే పబ్లిసిటీని పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసారు. విడుదల తరువాత వారం రోజులు కేవలం ప్రచారం మీదనే వుండడానికి మహెష్ ఓకె అన్నారు. అందుకే ముందుగానే వెకేషన్ కు వెళ్లివచ్చారు. వచ్చిన తరువాత డొమస్టిక్ గా భయంకరంగా ప్రచారం చేసారు.
ఇదంతా ఓకె. మరి ఓవర్ సీస్ మార్కెట్ సంగతేమిటి? అక్కడ ఇన్నాళ్లూ మహేష్ పేరిట వున్న నాన్ బాహుబలి రికార్డును రంగస్థలంలో మెగా హీరో రామ్ చరణ్ పట్టుకుపోయాడు. దాన్ని దాటాలంటే భరత్ కు కష్టంగానే వుంది. కాస్త గట్టి దూరమే వుంది. అయితే ఇది కాస్త ముందుగా ఆలోచించి దర్శకుడు కొరటాల లేదా, హీరో మహేష్ అమెరికాకు వెళ్లి, కాస్త హల్ చల్ చేసి వుంటే వేరుగా వుండేదేమో? కానీ ఇప్పుడు టైమ్ దాటిపోయింది.
ఇప్పుడు మహేష్ అమెరికా వస్తాననే చెప్పారని, అయితే టైమ్ దాటిపోయినందున ఇక ఇప్పుడు అనవసరం అని యూనిట్ వర్గాలు అభిప్రాయపడ్డాయని తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ వస్తే ఖర్చులు తడిసి మోపడవుతాయి. దాన్ని హీరో భరించడు. అయితే నిర్మాత లేదంటే డిస్ట్రిబ్యూటర్. ఈ చివరి టైమ్ లో మహేష్ వెళ్తే వచ్చే ఆదాయం కన్నా, అయ్యే ఖర్చు ఎక్కువగా వుంటుంది. మహా అయితే నాన్ బాహుబలి రికార్డు దక్కొచ్చు. దాని వల్ల వారికి ప్రయోజనం ఏమిటి?
అందుకే అమెరికా ప్రచారం అన్న అయిడియాకు ఫుల్ స్టాప్ పడిపోయింది. అందుకే ఇప్పుడు మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కు ఛలో పారిస్ అంటున్నారని బోగట్టా.