మీడియాకు బన్నీ మందు పార్టీ

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఎక్కువే టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత తన సినిమా నా పేరు సూర్య విడుదల కాబోతుండడం, పైగా ఈ మధ్యలో మీడియాతో మెగా…

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఎక్కువే టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత తన సినిమా నా పేరు సూర్య విడుదల కాబోతుండడం, పైగా ఈ మధ్యలో మీడియాతో మెగా ఫ్యామిలీకి కాస్త విబేధాలు రావడం, ఇతరత్రా వ్యవహారాలు బన్నీని మరి కాస్త టెన్షన్ కు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను, రామ్ చరణ్ ఫ్యాన్స్ ను యథాశక్తి దువ్వే ప్రయత్నం చేసిన, బన్నీ ఇఫ్పుడు మీడియాను కూడా పాంపరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య పుట్టిన రోజు వంక పెట్టి తన పబ్ లోనే మీడియాకు భారీ పార్టీ ఇచ్చాడు.

ఇప్పుడు మళ్లీ మరోసారి నిర్మాత లగడపాటి శ్రీధర్ ద్వారా మీడియాకు మరోసారి మందు పార్టీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మందు పార్టీకి సినిమా సమీక్షలు రాసేవారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్రమేమిటంటే, మీడియాలో ఎవర్ని పిలవాలో, ఎవర్ని పిలవకూడదో అన్నది చాలా పద్దతిగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.