‘సూర్య’కు కూడా అయిదాటలే

ఈ మధ్య ఆంధ్రలో ఏ పెద్ద సినిమా విడుదలయినా, తెల్లవారు ఝామన అయిదు గంటల నుంచి సినిమాలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చేస్తున్నారు. అజ్ఞాతవాసి నుంచి మొదలయింది ఈ కొత్త ట్రెండ్. Advertisement అయితే నా…

ఈ మధ్య ఆంధ్రలో ఏ పెద్ద సినిమా విడుదలయినా, తెల్లవారు ఝామన అయిదు గంటల నుంచి సినిమాలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చేస్తున్నారు. అజ్ఞాతవాసి నుంచి మొదలయింది ఈ కొత్త ట్రెండ్.

అయితే నా పేరు సూర్య విషయంలో మాత్రం కాస్త టెన్షన్ పడ్డారు. ఇటీవల మెగా ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీకి మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్న నేపధ్యంలో స్పెషల్ షోల కోసం అనుమతి దరఖాస్తు రెండు రోజుల పాటు అలాగే వుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.

అయితే అజ్ఞాతవాసి, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలకు ఇచ్చిన తరువాత నా పేరు సూర్యకు ఇవ్వకుండా వుండరని అందరూ అనుకున్నారు. అయితే కాస్త టెన్షన్ పెడతారని భావించారు.

ఆఖరికి అలాగే జరిగింది. సూర్యకు కూడా అయిదు ఆటల అనుమతి వచ్చేసింది. ఇంక దిగుల్లేదు. అయితే ఈ సంగతి అలా వుంటే చాలా చోట్ల అయిదు ఆటలు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని వినికిడి. బన్నీ సినిమాలకు ఎర్లీమార్నింగ్ షోల క్రేజ్ అన్ని చోట్ల ఒకలా వుండదని, అందుకే కొన్ని చోట్లనే అయిదు గంటలకు షోలు వుంటాయని తెలుస్తోంది.

ఇదిలా వుంటే తెలంగాణలో కూడా స్పెషల్ షోల కోసం అనుమతి వస్తుందని యూనిట్ వర్గాలు ధీమాగా వున్నాయి. గతంలో కొన్ని సినిమాలకు రాని మాట వాస్తవం అని, అయితే సరైన పద్దతిలో దరఖాస్తు చేసామని, అందువల్ల వస్తుందని భావిస్తున్నామని యూనిట్ వర్గాలు తెలిపాయి.